వైఎస్ వి-వే-క హ-త్య కే-సు-లో సిబిఐ వాళ్ళు వచ్చారు. కడప, పులివెందులలో హడావిడి చేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారు అనుకుంటే, 20 రోజులు గడుస్తున్నా అడ్రెస్ లేరు. ఎందుకు మధ్యలో వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు రాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది, కడప జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తున్న చర్చ. ఈ కేసు విచారణను హైకోర్ట్ ఆదేశాలతో, సిబిఐకి అప్పచెప్పారు. దీంతో సిబిఐ ఈ కేసు పై దర్యాప్తు చేపట్టింది. గత నెల 17న సిబిఐ బృందాలు, ఈ కేసు విచారణ మొదలుపెట్టాయి. విచారణ నిమిత్తం, సిబిఐ కడపకు వచ్చింది. జూన్ 17 నుంచి దాదాపుగా రెండు వారాలు, ఈ విచారణ చేసారు. కడపతో పాటుగా, పులివెందులలో కూడా ఈ విచారణ కొనసాగింది. ప్రధాన నిందితులు, కీలక సాక్ష్యులను, సిబిఐ, ఈ సమయంలో విచారణ చేసింది. వి-వే-క కూతురు సునీతను, పలుమార్లు సిబిఐ ప్రశ్నించింది. సునీత కూడా ఒక బ్యాగ్ నిండా ఆధారాలు తీసుకు వచ్చి, సిబిఐకి అప్పచేప్పారనే వార్తలు, ఫోటోలు వచ్చాయి. అయితే సిబిఐ విచారణ దూకుడు చూసి, ఈ కేసు తొందరలోనే ఒక కొలిక్కి వచ్చేస్తుందని, అందరూ భావించారు. సిబిఐ ఇంత వేగంగా విచారణ చెయ్యటంతో, తొందర్లోనే అసలైన వారు దొరికిపోతారని అందరూ అనుకున్నారు.

viveka 22082020 2

నిందితులు, సాక్ష్యులను విచారణ చేసిన తీరు కూడా చాలా స్పీడ్ గా జరిగింది. ముఖ్యంగా తన తండ్రి కేసులో చాలా లేట్ జరుగుతుందని, తీవ్ర జాప్యం చేసే కొద్దీ అసలైన వారు తప్పించుకుంటారు అంటూ, హైకోర్టులో కేసు వేసిన సునీత, పలుమార్లు సిబిఐ ముందు హాజరు అయ్యి, తన వద్ద ఉన్న సమగ్ర సమాచారాన్ని అందించారు. అలాగే కేసులో అనుమనాతులుగా ఉన్న సిఐ శంకరయ్య, వైసిపీ ముఖ్య నేత శంకర్ రెడ్డి, వివేక పీఏ, వంట మనిషి, వాచ్ మెన్ ను సిబిఐ ప్రశ్నించింది. గతంలో వేసిన సిట్ బృందాల చేసిన దర్యాప్తు రిపోర్ట్ లను సిబిఐ తెప్పించుకుని పరిశీలించింది. అలాగే మరికొందరి ముఖ్యులు, ప్రజా ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే గత నెలాఖరున సిబిఐ బృందం ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తాం అని చెప్పి, సిబిఐ బృందం ఢిల్లీ వెళ్ళిపోయింది. వరుసుగా సెలవులు ఉండటంతో, సెలవలు అయిన తరువాత వస్తారని అందరూ భావించినా, 22 రోజులు అయినా సిబిఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు. రెండు వారాల పాటు దడ దడ లాడించి, ఒకేసారి బ్రేక్ పడటంతో, కారణం ఏమిటి అనేదాని పై చర్చ జరుగుతుంది. త్వరలోనే సిబిఐ మళ్ళీ వస్తే, ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read