రాజధాని అమరావతి తరలింపుపై ఆచితూచి అడుగేయాలని వైఎస్ జగన్మో హన్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు తది తర అంశాలను నిశతంగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయాలనే భావనతో ఉన్నట్లు తెలి సింది. ఇందులో భాగంగా కేబినెట్ సమావేశాలను ముందుగా నిర్దేశించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే నిర్వహించాలని తొలుత నిర్ణయిం చారు. శనివారం రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఆతర్వాత సోమవారం నాటికి వాయిదా వేశారు. కాగా, భవిష్యత్ లో కేంద్రం నుంచి సహకారం అందుతుందనే భావనతో పాటు శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నందున రాజధాని వికేంద్రీకరణపై దూకుడు పెంచిన సర్కార్ భవిష్యత్ వ్యూహ రచనపై ఇప్పటికే నిమగ్నమైంది. బీజేపీ, జనసేన పొతు నేపథ్యంలో రాజధానితో సహా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆగమేఘాలపై రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
తొలుత 20వ తేదీన శాసనసభ సమావేశాలకు కొద్ది గంటల ముందే కేబినెట్ సమావేశం నిర్వ హించి రాజధానిని విశాఖకు తరలించే అంశాన్ని ఆమోదించు కోవటం ద్వారా స్పష్టత ఇవ్వాలనుకు న్నారు. దీనితో 18వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. కానీ, ఆ తర్వాత మరిణామాల నేపథ్యంలో మళ్లీ 20వ తేదీనే ఖరారు చేశారు. దీనికి తోడు హైకోర్టు కూడా రైతుల అభిప్రాయాలను సీఆర్డీఏ మెయిల్ కు పంపే విషయంలో ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్ర భుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలావుంటే, అమరావతిపై ఆచితూచి అడుగు పలు అంశాలతో పాటుగా రాజధాని తరలింపు, ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు సంబంధించి చట్ట సవరణ బిల్లులను శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఇతర బిల్లులపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బీజేపీ, జనసేనతో పాటు ప్రతిపక్ష పార్టీ లన్నీ రాజధాని తరలింపును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.
ఈ విషయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో అనర్థాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వీటన్నింటి పై కూలంకషంగా చర్చించటం ద్వారా కేబినెట్ సమావేశంలో అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది. కాగా ఈ నెల 20 నుంచి అధికారికంగా అమ్మఒడి నిర్వహణ అంశంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించ నున్నట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో స్పష్టత లేదు. గత కొద్ది రోజుల క్రితం వరకు యథాప్రకారం విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించా లని ప్రభుత్వం భావించింది. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.