మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తరువాత, అత్యున్నత సంస్థ సిఐడి. అలాగే ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. పెద్ద పెద్ద కేసులు కూడా అవలీలగా పట్టుకున్న చరిత్ర సిబిఐకి ఉంది. అలాంటి దర్యాప్తు సంస్థలు, ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన దా-డి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకోండి అంటూ స్వయంగా ఒక రాష్ట్ర హైకోర్టు ఫిర్యాదు చేసినా, ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నా, ఇంకా ఇంకా అదే హైకోర్టు, న్యాయం చేసారా అని రోజు అడగాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉంది. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పై రాష్ట్రంలో అధికార పార్టికి చెందిన వారు, కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు, వీడియోలు పెట్టారు. స్వయంగా హైకోర్టు రిజిస్టార్ ఫిర్యాదు చేసారు. మొత్తం 93 మంది పై ఫిర్యాదులు వెళ్ళాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా హైకోర్టు ఈ కేసుని సిఐడికి ఇచ్చింది. సిఐడి సరైన న్యాయం చేయలేదు. తరువాత హైకోర్టు ఈ కేసుని సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఈ కేసు ఇచ్చి ఏడాది అయ్యింది. అయితే ఇందులో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తిని ఇప్పటి వరకు సిబిఐ అదుపులోకి తీసుకోలేదు. ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని హైకోర్టు ప్రశ్నిస్తే, తన అడ్డ్రెస్ ఏమిటో, ఎక్కడ ఉంటాడో తెలియదు అంటూ సిబిఐ చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

punch 03112021 2

తరువాత స్టాండింగ్ కౌన్సిల్ నుంచి, పంచ్ ప్రభాకర్ అడ్డ్రెస్ సహా, ఇతర వివరాలు కోర్టుకు వచ్చాయి. సిబిఐ తీర్పు అనుమానాలు కలిగిస్తుందని హైకోర్ట్ చెప్పింది అంటే అర్ధం చేసుకోవచ్చు. చివరకు విసుగు చెందిన హైకోర్టు, మీకు పది రోజులు టైం ఇస్తున్నాం, అప్పటికీ మీరు అరెస్ట్ చేయలేకపోతే, మీకు చేతకాదని అర్ధం చేసుకుని, కొత్త దర్యాప్తు టీం ని నియమిస్తాం అని చెప్పింది. అసలు పంచ్ ప్రభాకర్ ని సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేక పోతుంది ? అసలు ఆ ప్రయత్నాలు కూడా ఎందుకు జరగటం లేదు అని చర్చ మొదలైంది. ఈ న్యాయమూర్తుల పైన కించపరిచే వ్యాఖ్యలు, ఒక కుట్ర ప్రకారం ఒక పార్టీ చేసిందని, పంచ్ ప్రభాకర్ లాంటి కీలక వ్యక్తులు పట్టుబడితే, ఆ పార్టీలో ఉన్న పెద్దలు లింకులు అన్నీ బయట పడతాయనే భయం, ఆ పార్టీ నేతల్లో ఉంది కాబట్టి, పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కాకుండా చూస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకే హైకోర్టు ఎంత గట్టిగా చెప్తున్నా, ఏడాది నుంచి, కనీసం అరెస్ట్ చేయలేదు అంటే, దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందనే చర్చ నడుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read