మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. వెనుకబడిన జిల్లాల కోసం గతంలో విడుదల చేసిన రూ.350 కోట్లకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు రాలేదని, అందుకే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమాధానమిచ్చారు. ఇప్పటివరకూ ఆ సొమ్ము విడుదల చేయలేదన్నారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూలు ఎంపీ బుట్టారేణుక అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

amaravati 04082018 2

‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 46(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాం. అందులో ఒక్కో జిల్లాకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు మూడు వాయిదాల్లో రూ.1,050 కోట్లు విడుదల చేశాం. విభజన చట్టం కింద కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం తరఫున చేయాల్సిన సాయంపై 2015 డిసెంబర్‌ 1న నీతి ఆయోగ్‌ ఏడు వెనుకబడిన జిల్లాలకు ఒక్కో దానికి రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల మొత్తాన్ని సిఫార్సు చేసింది. అందులోనే అంతకుముందు రెండేళ్లలో విడుదల చేసిన రూ.700 కోట్లు కూడా ఇమిడి ఉంది. వినియోగ పత్రాలను(యూసీ) నీతి ఆయోగ్‌ తనిఖీచేసిన తర్వాత, సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదముద్ర వేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తూ వస్తున్నాం. తాజా అంశంలో అవసరమైన అన్ని రకాల అనుమతులు లభించలేదు. అందువల్లే అనుకోకుండా రూ.350 కోట్లు విడుదల చేసి వెనక్కు తీసుకున్నాం. ఇంకా ఆ నిధుల విడుదల జరగ లేదు’’ అని మంత్రి పేర్కొన్నారు.

amaravati 04082018 3

అయితే, ఎవరు ఆ అనుమతులు ఇవ్వలేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే, ఇప్పటికీ నీతి ఆయోగ్, దీనికి సంబంధించిన అన్ని రకాల యుసీలు ఆమోదించింది. మరి, ఎవరి అనుమతి ఇవ్వలేదు అనే విషయం మాత్రం స్పష్టం లేదు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమని కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుందంటూ విమర్శలు చేస్తుండగా..భాజపా నేతలకు ఖండిస్తూ వస్తున్నారు. రెవెన్యూలోటు భర్తీ కింద ఇప్పటికే 96.94% మొత్తాన్ని ఇప్పటికే ఇచ్చేశామని ఎంపీ రాయపాటి సాంబశివరావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గణించిన ప్రకారం రూ.11,960.87 కోట్ల రెవెన్యూ లోటులో వ్యవసాయ రుణమాఫీ, రుణబాండ్లు తీసుకోవడానికి డిస్కంలకు చేసిన సాయం, పెంచిన పింఛన్లను కలిపారని చెప్పారు. వీటన్నింటినీ మినహాయిస్తే రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లేనని తేలిందని, అందులో ఇప్పటికే రూ.3,979.50 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read