రాష్ట్ర వ్యాప్తంగా సినిమా దియేటర్ల పై అధికారులు చేస్తున్న దాడులు ప్రదాన చర్చనీయాసంగా మారింది. ముఖ్యంగా సినిమా టికెట్ల రేటు విషయానికి సంభందించి ఇప్పటికే జివో నెంబర్ 35 విడుదల చేసిన ప్రభుత్వం, దానికి వ్యతిరేఖంగా డిస్ట్రిబుటర్స్ మరియు సినిమా పెద్దలు కోర్టుకు వెళ్ళారనే కక్ష్య తోనే ఈ దాడులు చేస్తునారని అని సినిమా వర్గాలు ప్రదానంగా అభిప్రాయ పడుతున్నాయి. నిన్న మొన్న చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం స్యయంగా దియేటర్లలోకి వెళ్లి అన్ని కోణాలలో పరిశిలించటమే కాక, జరిమానాలు కూడా విధించడం జరిగింది. అలాగే చాలా చోట్ల సినిమా హాల్స్ కూడా సీజ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో సినిమా పెద్దలతో పాటు ఎక్జిబిటర్స్ సంఘం కుడా ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని కుడా నిర్ణయించింది. దీనికి సంభందించి ఈ రోజు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం అయితే బి మరియు సి సెంటర్లలో అంటే పట్టణాలు, పల్లెలో అటువంటి ప్రాంతాల్లో 20 రూపాయలకి 30 రూపాయలకి సినిమా చూపించే పరిస్టితి ఉండదని, అలా కనుక చూపించ గలిగితే ఎదురు పెట్టుబడితో ప్రజలకి సినమా చుపించాల్సి వస్తుందని ఎక్జిబిటర్స్ అభిప్రాయ పడుతున్నారు.

cinema 23122021 2

దీనికి సంభందించి ఇప్పటికే చాలా మంది సినిమా పెద్దులు కూడా వివిధ రూపాల్లో తమ విజ్ఞప్తి కూడా తెలియ చేసారు. పేర్ని నాని కూడా కలిసి స్పందిచాలని కూడా వేడుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాటి పైన స్పందిచక పోగా దా-డు-లు మరింత విస్తృతం చేయడంతో ప్రస్తుతం సినిమా వర్గాలు కూడా హడలెత్తి పోతున్నాయి. అయితే ప్రస్తుత చర్యలు చూస్తే కేవలం ఉద్దేసపుర్వకంగానే, క క్ష్య పూరిత చర్యే నని అందరికి అర్థం అయిపోతావుంది. సినిమా పరిశ్రమ పై ఇంత కక్ష్య గట్టి ఎందుకు చేస్తునరనే కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఎవరో కొంతమంది హీరోలు కావచ్చు లేక పోతే వ్యతిరేఖ వర్గం కావచ్చు, వారిని దె-బ్బ కొట్టేతందుకే వేల మంది కుటుంబాలకు తిండి లేకుండా చేస్తున్నారనే చర్చ కూడా ప్రజల్లో నడుస్తా ఉంది. దీనికి సంభందించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా కోరతున్నారు. అదే విధంగా త్వరలోనే సినిమా పెద్దలు కొంత మంది బృందంగా ఏర్పడి జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినీ పెద్దలు అందరూ జగన్ కు జై అనే అంటున్నా, జగన్ ఎందుకు ఇలా వ్యవరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read