వైసీపీ అప్రతిహత గెలుపు తరువాత వైఎస్ జగన్ రెడ్డి మాటే శాసనంగా ప్రభుత్వం, పార్టీలోనూ కొన్నాళ్లు హవా సాగింది. ప్రభుత్వంలో నియంతృత్వ వైఖరి చెల్లుబాటు అవుతున్నా, పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. వారిని ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో జగన్ ఉన్నారు. ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ మారుతారనే భయం ఉంది. పాలన తీరు బాగా లేదని రోజుకొక ఎమ్మెల్యే బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు జగన్ వెనకాడుతున్నారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్నా ప్రభుత్వంలోనూ పాల్పడిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు వారు బయటపెడతారనే భయంతో జగన్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో అసమ్మతిస్వరాలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ పై సీఐడీ ప్రయోగించి థర్డ్ డిగ్రీ ప్రయోగించగలిగారే కానీ పార్టీ పరంగా ఏం చర్యలూ తీసుకోలేకపోయారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జగన్ జంకుతున్నారు. అయితే వైఎస్ జగన్ రెడ్డి తన పార్టీ మీద పూర్తిగా పట్టు కోల్పోయారని, అందుకే తన పాలనను ఘోరంగా విమర్శిస్తున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిపై చర్యలు ఆరంభిస్తే, వీరంతా కలిసి పార్టీ మారే అవకాశం ఉందనే భయమూ జగన్ రెడ్డి భయానికి మరో కారణమని విశ్లేషణలున్నాయి.
కీలక నేతలు, ఎమ్మెల్యేలు తిరగబడుతున్నా ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో జగన్
Advertisements