విశాఖను ఎగ్జిక్యూ టివ్ రాజధానిగా చేసేందుకు అవకాశాలున్నాయంటూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరతీసిన జగన్ విశాఖ పర్యటనలో నోరువిప్పి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం ఇప్పుడు సంచలనమైంది. అసెంబ్లీలో ప్రకటన తరువాత విశాఖ విశాఖ ఉత్సవాలను ప్రారంభించేందుకు తొలిసారి విశాఖ వచ్చిన జగనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే విశాఖ ఉత్సవాల ప్రధాన వేదిక ఆర్కే బీచ్ వద్ద జగన్ ప్రసంగం కోసం ఎదురు చూశారు. అనుకున్న సమయం కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన జగన్ విశాఖ ఉత్సవా లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్ వెళ్లిపోవడంతో హాజరైన జనం నివ్వెరపోయారు. కనీసం తమకు తిరిగి కృతజ్ఞతలైనా చెబుతారని భావించిన ప్రజానీకానికి నిరాశే ఎదు రైంది. రాజకీయాలు, రాజధాని ప్రకటనలు చేయకున్నా కనీసం విశాఖ ఉత్సవ నిర్వహణ, పర్యా టకం గురించి లేదంటే పారిశ్రామిక, ఇతర రంగాల అభివృద్ధి తదితర అంశాలను ప్రస్తావించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
కేవలం 25 నిముషాల పాటు ఉత్సవ వేదికపై ఉన్న జగన్ తన పాదయాత్ర, నవరత్నాల అమలు తదితర అంశాలతో రూపొందించిన ప్రాజెక్షన్ మ్యాపింగ్ ప్రద ర్శన, లేజర్ షో, ఫైర్ వర్క్స్ కాల్పులు చూసి వెళ్లిపోయారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి విశా ఖలో బహిరంగంగా వేలాది మంచి ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతారని, నగరానికి ఎన్నెన్నో వరాలు కురిపిస్తారని ఆశించిన ప్రజలు, స్థానిక నేతలు జగన్ ఒక్క నమస్కారంతో వెనుదిరగడం తీవ్ర నిరాశపరచింది. ప్రస్తుతం రాజధాని విషయంలో జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే జగన్ మౌనానికి కారణంగా రాజకీయ పరిశీల కులు భావిస్తున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా అసెంబ్లీలో ప్రకటించిన తరువాత జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా ఇంచుమించు అదేవిధంగా ఉండటంతో విపక్ష టీడీపీ సహా అన్ని రాజకీయ పక్షాలు ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై మండపడ్డాయి.
దీనికి తోడు రాజధాని అమరావతి నిర్మాణానికి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ, ఉద్యమం తారాస్థాయికి చేరుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. వైసీపీ మినహా రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు అమరావతిని తరలించడంపై మండిపడుతూనేన్నాయి. రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పుకొచ్చిన మంత్రులు ఈ అంశం జోలికే వెళ్లలేదు. బోస్టన్ కమిటీ నివేదికతో కలిపి చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించి అంశానికి ముగింపు పలికేశారు. రాజధాని విషయంలో అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన ప్రకటన, వైసీపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో ప్రభావం చూపిందా అనే అనుమానాలు సైతం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ నేప థ్యంలో విశాఖ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రసంగిస్తే తప్పనిసరిగా ఈ అంశాన్ని ప్రస్తావిం చాల్సి ఉంటుందని, అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటే విమర్శల ప్రభావం పెద్దగా ఉండదని, జగన్ భావించి ఉండవచ్చని చెప్తున్నారు.