కెసిఆర్ జగన్ దగ్గరకు వచ్చాడు.... జగన్ కెసిఆర్ దగ్గరికి వెళ్ళలేదు! కాంక్రీట్ పనుల్లో పోలవరం ప్రాజెక్ట్ గిన్నిస్ రికార్డు స్థాపించటం, పోలవరం విషయములో ప్రజల్లో ఒక స్పష్టత రావటానికి దోహదపడింది. దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు దారి తీసింది. అసలు గిన్నీస్ బుక్ వాళ్ల్లు ఆంధ్ర ఎందుకు వచ్చారో అర్ధం చేసుకునే లోపే పెన్షన్లు డబల్ అవ్వటం. పెన్షన్లు విషయములో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామాల్లో ఒక రకమైన సునామీని సృష్టించింది. ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ. దీన్ని ఎలా తట్టుకోవాలో, ఎలా ప్రజలను ఈ చర్చలనుండి డైవర్ట్ చెయ్యాలో ఆలోచిస్తూ అప్పిరితిప్పిరి అయ్యి తీసుకుంటున్న నిర్ణయాలు పాపం ఫ్యాన్ పార్టీకి, ఇటు కార్ పార్టీకి మంచికంటే చెడె ఎక్కువ చేస్తున్నాయి.
ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం సామజిక మీడియా వేదికగా జరిగిన విషయం పైన అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు కంప్లైంట్ చెయ్యటంతో ... ఇన్ని రోజులు సామజిక మీడియాకే పరిమితమైన అంశం ఇప్పుడు ప్రైమ్ మీడియా (ఎలక్ట్రానిక్, ప్రింట్) లోకి వచ్చి, రాష్ట్రములో ప్రతి ఒక్కరు దీని పై చర్చించటంతో ఈ విషయముతో సంబంధం ఉన్న ఇద్దరి వ్యక్తిత్వాలపైనా మరక పడే పరిస్థితి. ఆ పార్టీని అభిమానించే మహిళలలో అనేకమంది .. 'ఛీ... ఏంటిది' అంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక, జగన్-కే.టి.ఆర్. భేటీ కేవలం ఫ్యాన్ పార్టీ క్యాడర్ లో దిగజారిపోతున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని నిలబెట్టటం కోసం తప్ప మరిదేనికి కాదు. ఫెడరల్ ఫ్రంట్ లోకి ఎప్పుడైతే జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తాడో, ఆ ఫ్రంట్ గురించి ఇప్పటివరకు అంతో, ఇంతో ఆలోచిస్తున్న ఇతర పార్టీలు కూడా జంప్ జిలాని అంటాయి.
తమకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని వదిలి, ఆ పార్టీ పైనే దాడి చేస్తున్న జగన్, తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతాను అని హామీ ఇచ్చి, తెలంగాణ ఇచ్చాక, కాంగ్రెస్ పార్టీ నుండీ గెలిచిన వారిని కూడా తమలో కలిపేసుకుని తెలంగాణ క్రెడిట్ ఆ పార్టీకి ఏ మాత్రం దక్కకుండా చేసిన కెసిఆర్. మరో ముఖ్యమైన విషయం... ఈ ఫ్రంట్ భాజపాకు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబుతున్న మాటలను నమ్మేవారు ఎవరు లేరు. కెసిఆర్ కు తెలంగాణాలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ టి.ఆర్.ఎస్. 17 గెలిచాడు అనుకున్నా, ఆ సీట్లు కేంద్రంలో తాను పెత్తనం చెయ్యటానికి ఉపయోగపడతాయో లేదో తెలియని పరిస్థితి. అందువలన ఇప్పుడు జగన్ అవసరమయ్యాడు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను, ఇతర నాయకులను కలిసినా పెద్ద ఉపయోగం కనపడలేదు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే "కమాండ్ చేసే స్థాయిలో కెసిఆర్ అనే, ఈ రోజు జగన్ ప్రగతి భవన్ కు వెళ్ళేవాడు, కెసిఆర్ లోటస్ పాండ్ కు వచ్చేవాడు కాదు.