'నేను లేస్తే మనిషిని కాదు అని ఒకడు అనే వాడట... అందరు భయపడి అన్నీ ఇచ్చి పోయే వారట... తీరా ఆయనకు అంత శక్తి ఉందా? అని చూస్తే అయన కుంటివాడట.. నువ్వు లేగిసేది లేదు, మమ్మల్ని పీకేది లేదని, ప్రజలు అప్పటి నుంచి వాడిని పట్టించుకోవటం మానేశారు'... హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి అప్పుడప్పడు వచ్చే పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇలాగే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు లేట్ అయ్యాయి. ఆ మాటకు వస్తే తెలంగాణాలో కూడా పంచాయతీల కాలం అయిపోయినా, ఇప్పటికీ ఎన్నికలు లేవు. అక్కడ ప్రశ్నించే దమ్ము లేదు కాని, పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ నుంచి, ఇక్కడకు వచ్చి, పంచాయితీ ఎన్నికలు నా వల్లే చంద్రబాబు పెట్టటం లేదు అంటున్నారు.
నేను అంటే చంద్రబాబుకి భయం, అందుకే పంచాయతీ ఎన్నికలు పెట్టటం లేదు అంటున్నారు. 40 ఏళ్ళు ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, చెన్నా రెడ్డి, ఇప్పుడు నరేంద్ర మోడీ - అమిత్ షా లాంటి వారితో పోరాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి సీరియస్నెస్ లేని వాడిని చూసి భయతపడుతున్నారు అంట. అయితే అసలు వస్తాయో రాని ఏపి పంచాయతీ ఎన్నికల గురించి, ఈ హడావిడి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ? మీరు ఉండే తెలంగాణాలో, అసెంబ్లీ ఎన్నికలే వస్తున్నాయి. ఎలక్షన్ల డేట్ కూడా ఇచ్చారు. యుద్ధం అక్కడ జరుగుతుంది, మీ ప్రతాపం అక్కడ చూపించండి. ప్రశాంతంగా ఉన్న ఏపిలో వచ్చి, కత్తులు తిప్పుతారెందుకు ? యుద్ధం జరిగే తెలంగణాల పవన్ ఎందుకు రంగంలోకి దిగరు ?
అందరినీ నేనే గెలిపించా అని చెప్పే పవన్ కళ్యాణ్, నాకు భయపడి చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం లేదు అని చెప్పే పవన్ కళ్యాణ్, తెలంగాణాలో పోటీ చేసి, కెసిఆర్ ని భయపెట్టచ్చు కదా ? ఒక పక్క తెలంగాణాలో ఉన్న పవన్ సినిమా ఫాన్స్, పవన్ ఆంధ్రాలో చెప్పే మాటలు విని, ధీరుడు, సూరుడు అనే ఊహల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, కెసిఆర్, మహా కూటమి పక్కకి తప్పుకోవాల్సిందే అనే మాటలు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు, సిల్లీగా ఏపిలో పంచాయతీ ఎన్నికలు పెట్టటం లేదు, చంద్రబాబు భయపడుతున్నారు అని చెప్పే బదులు, తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యండి, మీ ప్రాతాపం అక్కడ చూస్తే, ఇక్కడ ఏపిలో ఉన్న మీ అభిమానులకి కూడా, మీ బలం ఎంత గొప్పదో తెలుస్తుంది.