మేధావి అయిన పవన్ కళ్యాణ్ గారు, మరి కొందరు మేధావులతో కలిసి, ఈ రోజు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పై చర్చించారు. చాలా మంచి పని చేసారు, ఎన్నో పరిష్కారాలతో ముందుకు వస్తారు అని అందరూ అనుకున్నారు. ఆ మేధావులు ఏమన్నారో కాని, ఈ మేధావి మాత్రం మేము చర్చింది ఇది అని ట్విట్టర్ లో వేసిన ట్వీట్లు మాత్రం, ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ ఉన్నది నిజంగా మేదావులేనా ? లేక వారు చెప్పిన దాన్ని వక్రీకరించి, ఈ మేధావి ట్వీట్ చేసాడా అనే అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా, ప్రతి ట్వీట్లో ఉత్తరాంధ్రని బయట నుంచి వచ్చిన వ్యక్తులు తోక్కేస్తున్నారు అని అక్కడ ప్రజలను రెచ్చగొడుతున్నాడు పవన్. అంతే కాదు, మాటి మాటికి, తెలంగాణా లాగా, ఉత్తరాంధ్ర కూడా ప్రత్యెక రాష్ట్రం కొరుకుంటుంది అని రెచ్చగొడుతున్నాడు..
ఆంధ్ర ప్రదేశ్‌లో భాగమైన ఉత్తరాంధ్ర మరో తెలంగాణ కావడానికి మరెంతో దూరం లేదు అంటూ, తల తిక్క ట్వీట్ వేసి, ఇప్పటికే మోడీ చేసిన నయవంచనతో, నాశనం అయిన మన రాష్ట్రాన్ని, ఇక్కడ ప్రజలను మరింతగా ఆందోళన పడేలా, ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ‘ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం మరింత ప్రబలే అవకాశం ఉందని కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రపై ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే.. మరో తెలంగాణ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అంటూ ట్వీట్ చేశాడు పవన్. ‘తెలంగాణ ఉద్యమం కూడా ఇలాగే ప్రారంభమైంది. ఏపీ నేతల అధికారంలో తీవ్ర అణచివేత, క్రూరత్వం భరించి వారు రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశారు. అదో మహత్తర ఉద్యమంగా రూపుదాల్చింది. చివరికి తెలంగాణ ఏర్పడింది. మరికొద్ది సంవత్సరాలు లేదంటే అంతకు ముందే ఉత్తరాంధ్ర కూడా ప్రత్యేక రాష్ట్ర అవుతుంది’ అని మరో ట్వీట్ చేశారు. ఇలా లేని ఉద్యమాన్ని, ప్రజల్లో లేని ఆలోచనలను రేకెత్తించి, రెచ్చగొడుతున్నాడు...
సరే, ఇదంతా బాగానే ఉంది.. ఉత్తరాంధ్ర బాగుపడాలి అంటే, మనకు విభజన హామీల్లో ఇచ్చిన రెండు అంశాలు ఇప్పటికీ కేంద్రం తేల్చలేదు. కొన్ని దశాబ్దాలుగా రైల్వే జోన్ పై విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి డబ్బులు కూడా ఏమి పెట్టనవసరం లేదు. ఒక నిర్ణయంతో మోడీ, రైల్వే జోన్ ఇవ్వచ్చు. కాని, మనకు ఆదాయం అంతా మన వైజాగ్ కు వస్తుంది కాబాట్టి, మోడీ ఇవ్వటం లేదు. దీని పై ఉత్తరాంధ్ర ప్రజలు, ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. అలాగే, వెనుకబడిన జిల్లాలు అయిన, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, నిధులు ఇస్తాం అని విభజన చట్టంలో పెట్టారు. మొన్న 350కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, చంద్రబాబు ఎదురు తిరిగాడు అని, ఆ 350కోట్లు వెనక్కు తీసుకున్నారు. మరి, ఈ రెండు అంశాలు అక్కడ మేధావులకు కనిపించలేదా ? లేక అక్కడ చర్చించినా, ఈ మేధావికి ట్వీట్ చేసి, మోడీ పై వ్యతిరేకంగా, ప్రజలకు చెప్పే ధైర్యం లేదా ? ఎందుకు మోడీని ప్రశ్నించకుండా, భయపడుతూ ఈ నాటకాలు ఆడుతున్నాడు ?