జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒకసారి అనుకున్నారు అంటే, మొండిగా వెళ్ళిపోతారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరి మాట వినరు. విద్యుత్ పీపీఏల విషయంలో, వివిధ దేశాలు,కేంద్రానికి ఉత్తరం రాసినా, కేంద్రం అనేక సార్లు అభ్యంతరం చెప్పినా, విద్యుత్ ఒప్పందాల సమీక్ష్ చేసి తీరుతాం అంటూ, దాదపుగా 5 నెలలు అలా మొండిగా ఉన్నారు. తరువాత, అన్నీ కాదు, మాకు అనుమానం ఉన్న వాటి మీదే సమీక్ష చేస్తాం అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే, జగన్ ఈ ఆరు నెలల్లో తీసుకున్న అనేక నిర్ణయం పై, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోను, అనేక విమర్శలు వచ్చాయి. అయితే, జగన్ మాత్రం, ఎక్కడా వెనక్కు తగ్గేది లేదు అనే విధంగా, సంకేతాలు ఇచ్చే వారు. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి, జగన్ వెనక్కు తగ్గారు. సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి వెనక్కు తగ్గి, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

housego 08122019 2

ఒక పక్క రాష్ట్రం తీవ్ర ఆర్దిక సంక్షోభంలో ఉంటే, జగన్ మోహన్ రెడి సొంత ఇళ్ళు, క్యాంప్ ఆఫీస్, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇలా అన్ని చోట్లా, ప్రభుత్వ ఖర్చులతో అదనపు సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు, తన ఇళ్ళ కోసం, దాదాపుగా 16.50 కోట్ల ఖర్చు అయ్యింది. ఇదంతా ప్రభుత్వ సొమ్ము అని, ప్రభుత్వ సొమ్ముతో, సొంత భవనాలకు, అదనపు హంగులు ఏమిటి అంటూ, సోషల్ మీడియాతో పాటుగా, నేషనల్ మీడియాలో కూడా జగన్ నిర్ణయాన్ని ఏకి పడేసారు. ముఖ్యంగా తన ఇంటి కిటికీల కోసం, 73 లక్షలు ఖర్చు చెయ్యటం, తీవ్ర విమర్శలు పాలు అయ్యింది. అలాగే వారం రోజుల క్రిందట కూడా, తన ఇంట్లో ఫర్నిచర్ కోసం 39 లక్షలు, లోట్‌సపాండ్‌లోని నివాసంలో అదనపు సదుపాయాలకోసం మరో రూ.24.50 లక్షలు కేటాయించారు.

housego 08122019 3

దీంతో ఈ చర్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. కేవలం ఏడు నెలల క్రిందట కట్టన తాడేపల్లి ఇంటికి, ఇన్ని ఖర్చులా అంటూ ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. 17 కోట్లతో, ఓక పెద్ద బంగ్లానే నిర్ణయం చెయ్యొచ్చని విమర్శలు వచ్చాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సోషల్ మీడియా దెబ్బకు వెనక్కు తగ్గింది. జగన్ ఇంటి సదుపాయాల కోసం, ఇచ్చిన కొన్ని జీవోలు రద్దు చేసారు. రద్దయిన పనుల విలువ రూ.2.87 కోట్లుగా తేల్చారు. మొత్తం ఆరు జీవోలు, వివిధ పనులు రద్దు చేస్తూ వచ్చాయి. అయితే వీటిని ఏ కారణంగా రద్దు చేస్తున్నారు అనే విషయం మాత్రం స్పష్టత లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు మేరకే, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తుంది. మొత్తానికి, సోషల్ మీడియా దెబ్బకు, ప్రభుత్వం వెనక్కు తగ్గి, ప్రభుత్వ ఖజానాకు, రూ.2.87 కోట్లు మిగిల్చిందనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read