దాదాపు నెల రోజుల క్రితం, ఏప్రిల్ 6న మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు అని జగన్ ప్రకటించాడు.. అయితే, వెంటనే, పార్లమెంట్ సభ్యులు మాత్రమే, రాజ్యసభ సభ్యులు కాదు అంటూ, నొక్కి నొక్కి చెప్పారు... అయితే, ఇలా ఎందుకు అంటే, ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు.. నెల రోజులు నుంచి, ప్రతి రోజు మీడియా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంది.... విజయసాయి రెడ్డి, వేమి రెడ్డి ఎందుకు రాజీనామా చెయ్యరు అని అడుగుతుంటే, ఒక్కరు అంటే దీనికి సమాధానం చెప్పటం లేదు... అయితే, కొన్ని రోజుల క్రిందట, పాదయత్రలో ఉన్న వైఎస్ జగన్, ఎంపీలను పిలిపించుకుని మాట్లడారు...
ఆ సమయంలో ఒక ఎంపీ, ఇదే ప్రశ్న జగన్ ను అడిగారు... మేము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోతున్నాం... విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చెయ్యరు అని అడుగుతుంటే, మా దగ్గర సమాధానం లేదు అని జగన్ దగ్గర గట్టిగా అడిగినట్టు సమాచారం.. అయితే, ఈ విషయం పై జగన్ క్లారిటీ ఇచ్చారు... మనకు పార్లమెంట్ సభ్యలు రాజీనామా చేస్తే, మ్యానేజ్ చేసుకునే అవకాసం ఉంది... మనకు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి... రాజీనామాలు ఆమోదించకుండా, మనం మ్యానేజ్ చెయ్యగలం... కాని రాజ్యసభలో పరిస్థితి వేరు అని చెప్తూ, దానికి కారణం చెప్పారు జగన్...
పార్లమెంట్ అయితే, మనం రాజీనామాలు ఆమోదించకుండా మ్యానేజ్ చెయ్యవచ్చు... అదే సాయన్న రాజ్యసభలో రాజీనామా చేస్తే, అక్కడ ఉన్నది వెంకయ్య నాయుడు... ఆయన మీద ఇప్పటికే మనం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసాం.. అదీ ఆయన్ను మ్యానేజ్ చెయ్యటం కష్టం.. మరి, సాయన్న ఫిర్యాదు చెయ్యగానే, వెంకయ్య ఆమోదం చేస్తే, మన పరిస్థితి ఏంటి అంటూ జగన్ ప్రశ్నించారు.. వేమి రెడ్డి నిన్న కాక మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యారు... ఆయన మనకు కొంత కమిట్మెంట్ ఇచ్చారు.. ఇప్పుడు ఆయన్ను రాజీనామా చెయ్యమంటే, నేను ఆ కమిట్ అయ్యింది వదులుకోవాలి.. అందుకే రాజ్యసభ సభ్యలు రాజీనామా చెయ్యరు... మీరే ఎలాగొలా మ్యానేజ్ చెయ్యండి.. మీ రాజీనామాలు ఆమోదం పొందవు, నాది హామీ అని ఎంపీలు చెప్పారు జగన్... మొత్తానికి, వెంకయ్య దెబ్బకు, జగన్, విజయసాయి ఇలా భయపడుతున్నారు...