సహజంగా ఎవరి పార్టీ వారికి ఉంటుంది. ఎవరి పార్టీ వ్యవహారాలు వారికి ఉంటాయి. ఆయా పార్టీల్లో, ఎవరు అధ్యక్షుడు, ఎవరు జనరల్ సెక్రటరీ, ఎవరు కార్యవర్గం అనేది, ఆ పార్టీ అంతర్గత విషయం. తమ పార్టీ బలోపేతం అవ్వటానికి, ఆయా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. పక్క పార్టీల వారికి, అవి అనవసరం కూడా. కానీ మన రాష్ట్రంలో ఒక వింత పరిస్థతి ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న బీజేపీని మెడలు వంచుతాం అన్న వాళ్ళు, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, ఈ దేశంలోనే ఎవరూ నిలదీయని విధంగా, బీజేపీని నిలదీసి, రాజకీయంగా దెబ్బ తిని, తన పని తాను చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏపి బీజేపీ అధ్యక్షుడు మార్పు జరిగింది. కన్నా లక్ష్మీ నారాయణ పదవీ కాలం ముగియటంతో, కన్నా స్థానంలో సోము వీర్రాజు వచ్చారు. సహజంగా కొత్త అధ్యక్షుడు వస్తే, బీజేపీ క్యాడర్ సంతోషంతో ఊగిపోవాలి కానీ, ఎందుకో మరి, వైసీపీ ఊగిపోతుంది. అదేదో తమ గొప్ప విజయం అన్నట్టు, సోషల్ మీడియాలో ఉన్న బ్యాచ్ గుడ్డలు చించుకుంటుంది.

వేరే పార్టీలో ఉన్న అధ్యక్షుడు మారిపోతే, వీళ్ళు సంబర పడుతున్నారు అంటే, గతంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అంటే వీళ్ళకు భయమా ? లేక సోము వీర్రాజు మన వాడే, మన పార్టీకి అనుకూలం, కన్నా లక్ష్మీనారాయణ 108 స్కాం, కరోనా కిట్ల స్కాం బయట పెట్టినట్టు, సోము వీర్రాజు మన స్కాంలు ఏమి బయట పెట్టరులే అనే ధీమానో కానీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా, ఎదో పెద్ద ఘనత సాధించినట్టు, నిన్న రాత్రి నుంచి ఊగిపోతున్నారు. రేపు ఒక వేళ, సోము వీర్రాజు కూడా, వీళ్ళ స్కాంలు బయట పెడితే, కన్నా మీద ఆరోపణలు చేసినట్టు, సోము వీర్రాజు కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయాడు అని, ఆరోపణలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎవరైనా తమ బలం పై, ఆధారపడి రాజకీయం చేస్తారు కానీ, ఎదుటి పార్టీలో ఎవరో ఎదో పదవిలోకి వస్తే, వీళ్ళు సంబరపడటం చూస్తుంటే, ఏదో మొరటు సామెత గుర్తుకు వస్తుంది. అయినా ఢిల్లీ బీజేపీ, కనీసం సియం హోదాలో ఉన్న జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వటానికి కూడా ఇష్ట పడటం లేదు, అలాంటిది ఇక్కడ సోము వీర్రాజు ఉంటే ఏమిటి, జీవీఎల్ ఉంటే ఏమిటి, కన్నా ఉంటే ఏమిటి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read