తెలంగాణాలో ఎన్నికల సమరం జరిగింది. చంద్రబాబు డేరింగ్ గా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, మోడీ పంచన చేరిన కేసీఆర్ ను ఎదుర్కునే ప్రయత్నం చేసారు. అయితే తెలంగాణా ప్రజలు మాత్రం, మాకు కేసీఆరే కావాలని తీర్పు ఇచ్చారు. ఎలా గెలిచినా, అది గెలుపు గెలుపే. యుద్ధంలో గెలవటం ముఖ్యం, భారీ మెజారిటీతో కేసీఆర్ గెలిచి చూపించారు. అసలు పార్టీనే లేదు అన్న దగ్గర నుంచి, గట్టి పోటీ ఇచ్చారు చంద్రబాబు. యుద్ధంలో కేసీఆర్ ని డీ కొట్టారు. ఎవరో ఒకరు గెలవాలి, కేసీఆర్ గెలిచారు. ఎక్కడ తప్పు జరిగింది, ఏంటి అనేది చంద్రబాబు సమీక్షించుకుని, తగు నిర్ణయం తీసుకుంటారు. గెలుపు, ఓటములు చంద్రబాబుకి కొత్త కాదు. ఏదైతేనేం, ఆంధ్రా వాళ్ళని అమ్మనా బూతులు తిడుతున్న కేసీఆర్ ను, ఆంధ్రా వాళ్ళని నాశనం చెయ్యాలని చూస్తున్న మోడీ, ఇద్దరికీ చంద్రబాబు ఎదురుగా నిలబడ్డారు. కాని యుద్ధంలో ఓడిపోయారు.

janasena 11122018

అయితే ఆంధ్రా వాళ్ళని, తిట్టిన కేసీఆర్, నాశనం అవ్వాలని చూస్తున్న మోడీ, వీళ్ళద్దరి జోడీ సక్సెస్ అయితే, అసలు యుద్ధమే చెయ్యని వైసీపీ, జనసేన హడావిడి చేస్తున్నాయి. కేసీఆర్ మా ఆస్థులు పై దాడులు చేస్తాడని ఒకడు, మా పెన్ డ్రైవ్ బయట పెడతాడని ఒకడు, అసలు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా పారిపోయారు. నేనే అందరినీ గెలిపించా అని చెప్పే హీరో గారు, అసలు అడ్రస్ లేరు. ఇలాంటి వాళ్ళు, అసలు యుద్దమే చెయ్యలేని వారు, ఇప్పుడు వచ్చి, యుద్ధంలో ధైర్యంగా పోరాడిన చంద్రబాబు పై ఎగురుతున్నారు. తెలంగాణా గెలిచిన కార్ గుర్తు కనపడింది. ఓడిన కూటమి గుర్తులు కనపడినాయ్. కానీ గెలిచాం అని ఎగురుతున్న సేనలు గుర్తు కనపడలా. ఇంతకీ ఏ గుర్తు మీది వీళ్ళు పోటీ చేసారు ? ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు ?

janasena 11122018

పోటీ చేసి గెలిచిన తెరాస పార్టీ సంబరాలు చేసుకుందంటే అర్ధముంది. పోటీ చేసి ఓడిపోయిన కూటమి నేతలు బాధపడటంలో అర్ధముంది. కానీ అసలు పోటీనే చేయకుండా, పరికి పందల్లాగా తప్పించుకున్న ఈ రెండు పార్టీల హడావిడి చూస్తుంటే ఒక సామెత గుర్తుకువస్తుంది. "ఊరిలో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో".. ఇక ఈ రెండు పార్టీలు సంగతి పక్కన పెడితే, బీజేపీ పార్టీది కూడా మరో ఎత్తు. మొత్తం అయుదు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయింది. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. వీరికి ఆ బాధ లేదు కాని, తెలంగాణాలో చంద్రబాబు వ్యూహం దెబ్బ కొట్టిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితులు. గెలిచిన వాడు, ఓడిన వాడు బాగానే ఉన్నా, ఈ ఆటలో అరటిపండు గాళ్ళ హడావిడి ఎక్కువైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read