అందరూ ఊహించినట్లుగానే శాసనమండలి రద్దుచేస్తూ కేబినెట్, శాసనసభ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల కాలంలోనే జగన్ తీసుకున్న అతి తిక్క నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను తెసుకున్న ప్రతి నిర్ణయంలోను మండలి మొదటి నుంచీ ఏదో సాకుతో తిరిగి వంపుతోంది అని జగన్ భావిస్తున్నారు. టిడిపి తనకున్న అవకాశాలను వినియోగిస్తూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేవిధంగా సభలో ఒత్తిడి తెచ్చింది. చైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభిప్రాయాలు తీసుకోవడానికి జగన్ మూడ్రోజుల సమయం కేటాయించారు. శాసనసభ ద్వారా మండలిని రద్దుచేస్తూ తీర్మానంచేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.

జగన్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగించారు. ఇదే అంశం పై మంత్రులు, సభ్యులు రద్దు అనివార్యమని చెప్పారు. చివరకు మండలిని రద్దు చేయాలని తీర్మా నం చేస్తూ కేంద్రానికి నివేదించారు. ఈ తీర్మానం ముందుగా కేంద్ర హోంశాఖకు చేరుతుంది. అక్కడ తీర్మానం పరిశీలించి కేంద్ర హోంమంత్రి, ప్రధాని అంగీకరిస్తే.. కేంద్ర కేబినెట్ సమావేశంలో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే పార్లమెంటులోని రెండు సభల్లోనూ ఆమోదం పొందాలి. ఆ తర్వాత మాత్రమే తిరిగి హోంశాఖ రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఆయన ఆమోదం పొందిన తర్వాత మండలిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కానుంది. అప్పటివరకూ మండలి రద్దు ప్రక్రియ అమల్లోనే ఉంటుంది. మండలి సభ కొనసాగడం, చర్చలు నిర్వహించడం యధాతథంగానే కొనసాగుతుంది.

ఏపి శాసనమండలిలో బిజెపి నుంచి సోము వీర్రాజు, మాధవ్ ఇద్దరు సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపితో టచ్ లో ఉన్నారు. అయితే తమ పార్టీకి చెందిన సభ్యులెవరూ ఇప్పుడు ఎపి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడంలేదు. తాజా నిర్ణయంతో మండలిలోనూ అవకాశం కోల్పోతారు. ఇద్దరు సభ్యులకోసం బిజెపి అధినాయకత్వం ఆలోచన చేయదని, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను వరిగణలోకి తీసుకుంటుందని నిపుణులంటున్నారు. తమిళ నాడులో ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా మండలిని రద్దుచేస్తూ తీర్మానం పంపగా, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎపి ముఖ్యమంత్రికి కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాల ఆధారంగానే దీనిపై నిర్ణయం వెలువడుతుందని వారి అంచనా. ఇప్పటినుంచి రెండేళ్లు పడుతుందని టిడిపి వాదిస్తుంటే, అంత సమయం పట్టదని, బిజెపి జగనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఎపి మండలిరద్దు తీర్మా నంపై కేంద్రస్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read