జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేసారు, చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వానికి అయినా సహజం. తమ తప్పులు తాము తెలుసుకోరు, ఎదుటి వాళ్ళు చెప్తే వినరు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకీ శ్రుతి మించుతుంది. ముఖ్యంగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే భాష, చాలా జుబుక్సా కరంగా, సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంటుంది. మంత్రి కొడాలి నాని భాష, నాగరికత ఉన్న ఎవరూ మాట్లాడరు. ఈ కొడాలి నానికి తోడుగా, రోజా, అంబటి, మరో మంత్రి అనిల్, ద్వారంపూడి, వంశీ, పేర్ని నాని, ఇలా చాలా మంది లైన్ లో ఉన్నారు. ఒక్కరికి కూడా భాష సరిగ్గా ఉండదు. కేవలం బూతులతో పడిపోతూ ఉంటారు. చివరకు ఈ భాగోతం అసెంబ్లీ వరకు వెళ్ళింది. టిడిపి సభ్యులు మాట్లాడుతూ ఉంటే, కొడాలి నాని చెప్పలేని భాషలో తిడుతూ ఉంటారు. మొన్న చంద్రబాబు మొఖం చూడాలని జగన్ మోహన్ రెడ్డి అనటం, దానికి చంద్రబాబు దీటుగా సమాధానం చెప్తూ, అసెంబ్లీకి రావటంతో, వైసీపీ వెర్రెత్తి పోయింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పైన బజారు మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి, ఎక్కడా ఈ బూతులు మంత్రులను, ఎమ్మెల్యేలను కట్టడి చేయటం లేదు. ఆయన సంతోషిస్తూ ఉంటారు.

sad 05122021 2

దీంతో జగన్ మోహన్ రెడ్డిని సంతోష పెట్టటానికి, మరింతగా రెచ్చిపోతూ ఉంటారు. అయితే భువనేశ్వరి ఘటన మాత్రం, అతి పెద్ద తప్పుగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆవిడ ఎప్పుడూ బయట కనిపించే వ్యక్తి కాదు. అలాగే చంద్రబాబు కూడా అలా బాధ పడటం, అందరినీ కలిచి వేసింది. ఈ విషయంలో తాము చాలా పెద్ద పొరపాటు చేసాం అని వైసీపీ గ్రహించింది. మొన్నటి వరకు అసలు తాము ఆ మాటలే అనలేదు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు అంటున్న వైసీపీ, ఇప్పుడు సమస్య తీవ్రత గ్రహించింది. ముందుగా వంశీ చేత క్షమాపణ చెప్పించింది. అది కూడా దాదాపుగా 20 రోజులు తరువాత. ఆ తరువాత నిన్న మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ, భువనేశ్వరి బాధ పడి ఉంటే, మా 151 మంది ఎమ్మెల్యేలు ఆమె కాళ్ళని, మా కన్నీళ్ళతో కడుగుతాం అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక్కడే అర్ధం అవుతుంది వైసీపీ ఎంత డిఫెన్స్ లో పడింది అనేది. అందుకే చేసిన అతి పెద్ద తప్పుని దిద్దుకునే పనిలో వైసిపీ పడింది. ఇలాంటి వ్యాఖ్యలు చాలా వింటాం. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజలు స్వీకరిస్తారా ? ప్రజలు నమ్ముతారా ? చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read