తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, కేంద్రం తనకు బాగా అలవాటు అయిన ఆట ఆడుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో చేసిన విధంగానే, తెలంగాణాలో విపక్ష నేతల పై, ఐటి, ఈడీ దాడులు చేపిస్తుంది. దీనికి కెసిఆర్ సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండగా, హైదరాబాద్ మీడియా పూర్తిగా కెసిఆర్ కి లొంగిపోయింది. ఒక పక్క రేవంత్ ఇంటి పై ఐటి దాడులు జరుగుతూ ఉండగానే, కొన్ని ఫేక్ పత్రాలు పుట్టించి, ఇవి రేవంత్ ఆస్తులు అని, ఇవి రేవంత్ బ్యాంక్ ఎకౌంటు నెంబర్లు అని, రేవంత్ కి 1000 కోట్ల ఆస్తి ఉందని, రేవంత్ ఇంట్లో రెండు కోట్లు పట్టుకున్నారని, ఇలా హైదరాబాద్ మీడియా రకరకాల ప్రచారాలు చేసింది. చివరకు 50 గంటల సోదాలు తరువాత, ఒక్క కాగితం ముక్క కూడా ఐటి అధికారులు పట్టుకోలేదు.
కనీసం ఇది రేవంత్ చేసిన తప్పు, ఇందుకు మేము సోదాలు చేసాం అని మీడియాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉంటే, రేవంత్ ని మరోసారి అక్టోబరు 3వ తేదీన విచారణకు రావాలని రేవంత్‌కు నోటీసు ఇచ్చారు. బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్లో అధికారుల ఎదుట విచారణ ఉంటుందని, దానికి హాజరు కావాలని సూచించారు. అయితే, ఇదే వార్తా పట్టుకుని, దీన్ని చంద్రబాబుకి లింక్ చేస్తూ, హైదరాబాద్ మీడియా కవర్ చేసుకుంటుంది. ఎప్పుడో కొట్టేసిన ఓటు కు నోటు కేసుని మళ్ళీ ప్రచారం చేస్తూ, ఇది రేవంత్ వర్సెస్ కెసిఆర్ ఫైట్ గా తెలంగాణా సమాజం చూస్తుంది కాబట్టి, దీన్ని డైవార్ట్ చేసి, రేవంత్ కి వచ్చిన హైప్ తగ్గించటానికి, మళ్ళీ దీన్ని చంద్రబాబు వెర్సెస్ కెసిఆర్ ఫైట్ గా చిత్రీకరిస్తుంది హైదరబాద్ మీడియా..
ఇందులో భాగంగానే రేవంత్ అక్టోబర్ 3 న అరెస్ట్ అవ్వటం ఖాయమని, దీనికి ఓటు కు నోటు కేసు కారణమని, తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. అంతే కాదు, రేవంత్ అరెస్ట్ సాకుగా చూపి, అక్టోబర్ 8 న చంద్రబాబు ఇళ్ళ పై ఏక కాలంలో ఐటి, ఈడీ దాడులు జరుగుతాయి అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టింది హైదరాబాద్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై, ఇతర ఆస్తులపై దాడులు చేయబోతున్నారని కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అన్నట్టు, రేవంత్, చంద్రబాబు బినామీ అని ప్రచారం మొదలు పెట్టారు. దీనికి కారణం, కెసిఆర్ ని ఎన్నికల్లో గట్టు ఎక్కించటానికి. ఎన్నికలు కెసిఆర్ పరిపాలన మీద కాకుండా, కెసిఆర్ వర్సెస్ చంద్రబాబుగా మార్చటానికి, హైదరాబాద్ మీడియా తెగ తాపత్రయ పడుతుంది. అందుకే అసలు కేసు లేని ఓటు కు నోటు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇలాంటి పిచ్చ కేసులు పట్టుకుని చంద్రబాబు లాంటి వాడి పైకి వస్తే, ఏమి అవుతుందో మోడీకి బాగా తెలుసు. హైదరాబాద్ మీడియా, ఇప్పటికైనా కొంచెం వెన్నుముక తెచ్చుకుని, నిజాలు రాయాలని మనవి.