రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు, నిప్పు లా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్, విపక్షనేత చంద్రబాబు ఎదురెదురుగా కూర్చునే ఆరుదయిన ఘటన ఈ నెల పదిహేడో తేదీన జరగబోతోంది. జగన్ సారధ్యంలో మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం అత్యున్నత కమిటీ ఈ నెల 17న ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతోంది. నిబంధనల ప్రకారం.. ఈ కమిటికీ ముఖ్యమంత్రి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ, శాసన మండలిలో ప్రతిపక్ష నేతలతో పాటు హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. జగతో పాటు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, హోంమంత్రిగా సుచరిత , అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని, మండలి చైర్మన్‌గా షరీఫ్, మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల కూడా సభ్యులుగా ఉంటారు. మొత్తం ఆరుగురితో ఉన్న ఈ అత్యున్నత కమిటీ లో ముగ్గురు వైకాపాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు తేదేపా నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం మానవహక్కుల కమిటీ ఏర్పా టు జరుగుతుంది. హెఆర్సీ ఏర్పాటు విషయంగత ఆరేళ్లుగా నలుగుతోంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెర్ఆర్సీని ఏర్పాటు చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కదిలింది. ఏపీలో హెల్జర్సీ ఏర్పాటు చేయాలని స్వచ్చంద సంస్థలు కోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే హెల్జర్సీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం పలుమార్లు గడువు కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టు ధిక్కరణ వరకూ వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల ఎంపిక కోసం అక్టోబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసింది.
అందుకు అనుగుణంగా కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. హెర్ఆర్సీ ఏర్పాటు చేయకపోతే న్యాయస్థానాల నుంచి ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతాయి. ఒకవేళ ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా కమిటీ సమావేశం నిర్వహించి... కమిటీని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్, విపక్ష నేత చంద్ర బాబుతో పాటు షరీఫ్, యనుమలతో సమావేశానికి అంగీకరంచినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికైతే అధికారికంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజుకు జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా... ఒక వేళ జరిగితే.. ప్రతిపక్ష నేతలు హాజరవుతారా.. అన్నది సస్పెన్స్ మారింది. ఒకవేళ హాజరయితే హెస్ఆర్సీ కమిటీ విషయంలో... ప్రభుత్వం సిద్ధం చేసిన చైర్మన్, సభ్యుల విషయంలో విపక్షం వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో కమిటీ నియామకం పెండింగ్ లో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి భేటీలో హెచ్ ఆర్సీ సభ్యుల ఎంపికపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.