నిన్న ఢిల్లీలో, రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ అధికారులు రైల్వే జోన్ గురించి ప్రస్తావించగా రాజీవ్ గాబా మాట్లాడుతూ ప్రత్యేక రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండబోదన్నారు.
దీంతో అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అధికారులు గట్టిగా గొడవ చెయ్యటంతో, మేమైతే ఇది కుదరదు అని చెప్తున్నామని అధికారులు చెప్పారు.. కేంద్రం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఈ విషయంలో రాజకీయ నిర్ణయం అవసరమని, నెల రోజుల్లో కేంద్ర హోంమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు... దీంతో రాష్ట్ర అధికారులు తీవ్ర నిరాశతో, విషయన్ని ముఖ్యమంత్రికి చెప్పారు... రైల్వే జోన్ కూడా ఇక ఇవ్వరు అనే అభిప్రాయం కలుగుతుందని, అధికారులుగా ఇక మేము ఏమి చెయ్యలేని స్థితి ఉందని, కేంద్ర అధికారులు తెగేసి ఇది లాభం కాదని చెప్తున్నారని చెప్పారు...
దీంతో రాజకీయంగా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అలోచించి, ముందుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను చంద్రబాబు ఆదేశించారు... దీంతో ఈ రోజు సాయంత్రం, నాలుగు గంటలకు ఎంపీలు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు... ఈ సందర్బంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పనున్నారు... దీంతో ఈ రోజుతో, రైల్వే జోన్ కేంద్రం ఆమోదిస్తుందో లేదో, తేలిపోనుంది... పీయూష్ గోయల్ కి చంద్రబాబుకి ఎంతో సాన్నిహిత్యం ఉంది... చాలా సందర్భాల్లో పీయూష్ గోయల్, నేను చంద్రబాబుకి వీరభిమానని అని చెప్పుకున్నారు కూడా... అయితే, ఈ విషయంలో మోడీ డైరెక్ట్ ప్రమేయం ఉండటంతో, ఏమి చెయ్యలేని పరిస్థితి...