నేను తిట్టాలి అంటే వాడు బలహీనుడు అయ్యి ఉండాలి.. నేను ఎంత హీనంగా తిట్టినా, నన్ను ఏమి అనని సంస్కారం ఉన్న వాళ్ళు అయ్యి ఉండాలి... వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు ఫోటోలు మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చెయ్యండి.. మిగతా వాళ్ళు ఎవరు తిట్టినా, తుడుచుకుని పోండి.. ఇది ఈ రోజు పవన్ పెట్టిన కాంప్రోమైజ్ ట్వీట్ ఉద్దేశం.. కులబలం, ఆర్ధికబలం, మందబలం లేని దళితుడు కాబట్టి కత్తి మహేశ్ మీద దండయాత్ర చేశారు. చెప్పులు, గుడ్లు కొట్టారు. అండదండల్లేని చిన్న హీరోయిన్ శ్రీరెడ్డి మీదకి మొత్తం మెగా ఫ్యామిలీ మా అసోషియేషన్ ఆఫీసుకి వెళ్ళి వీరంగం వేసింది. ఇప్పుడు మాత్రం జగన్ రెడ్డి అంత బాహాటంగా పవన్ పై అన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే కనీసం ఒక వైసీపీ ఆఫీసు ముందు ధర్నా చెయ్యలేకపోయారు.
మళ్ళీ మేము లేస్తే మనుషులం కాము అని బోసడింగులు. వైసీపీవాళ్ళు తంతారని భయమా ? లేక ఎలాగూ మీలో సగం మంది జనసేన ముసుగులో ఉన్న జగన్ రెడ్డి కోవర్టులు కాబట్టా ? పవన్ కల్యాణ్ దేబుడు.. ఏమన్నా అంటే పొడిసేత్తాం...సంపేత్తాం అని వీరంగం వేసే బుడగలన్నీ పేలిపోయి, గమ్మున మూలకి చీపుళ్ళలాగా కూచున్నయి. పవన్ ఒక బుడగ అని తేలిపోయింది. మాకు బలం తూర్పు గోదావరి జిల్లా అని చెప్పుకునే జనసేన, అదే చోట జగన్ మిమ్మల్ని అన్ని మాటలు అంటే, కనీసం జగన్ ఉంటున్న చోటుకు వెళ్లి నిరసన చెప్పలేకపోయారు. అంటే మీ ప్రతాపం చూపించేది, శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారి మీదేనా ? చంద్రబాబు, లోకేష్ లాంటి వారిని ఏమన్నా అన్నా, వారు సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి, వారిని ఎన్నైనా అనొచ్చు అనా ?
జగన్ చెప్పిన మాటలకు, కనీస ప్రజాస్వామ్య విధంగా కూడా నిరసన తెలిపలేదు అంటే అర్ధం ఏంటి ? ఈ రోజు వివాదం అయిపొయింది అని చెప్పటంలో అర్ధం ఏంటి ? ఇద్దరూ కలిసి ఈ నాటకం ఆడి ఉండాలి... లేకపోతే పవన్ కళ్యాణ్ కు, జగన్ లాంటి వారిని టచ్ చేసే దమ్ము లేక అయ్యి ఉండాలి. మరో పక్క పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి, ఇంట్లో ఆడవాళ్ళను లాగటం గురించి కూడా ట్వీట్ చేసారు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు భార్య, కోడలు కష్టపడి 22 ఏళ్ళ నుంచి నడుపుకుంటున్న హెరిటేజ్ పై విమర్శలు చేసి, వారిని బజారుకు లాగినప్పుడు ? రాధాకృష్ణా, రవిప్రకాష భార్యల ఫోటోలు, ట్వీట్ చేసినప్పుడు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగ కూడదు అని తెలియాదా ? కులబలం, ఆర్ధికబలం, మందబలం లేని వాళ్ళు, సంస్కారంతో ఉన్న వాళ్ళే పవన్ టార్గెట్.. అందుకే జగన్ జోలికి వెళ్ళే సాహసహం కూడా చెయ్యలేక పోయాడు. మళ్ళీ, నేను లెగిస్తే మనిషిని కాదు అని బిల్డ్ అప్ ఒకటి.. సరైన రాజకీయం చెయ్యండి పవన్ గారూ...