ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారం, త్వరలో అధ్యక్షా అనే పిలుపు నుంచి, అమాత్యా అనే పిలుపులోకి మారనున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అవును అనే అనిపిస్తుంది. సహజంగా స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయాలు మాట్లాడరు. మాట్లాడినా ఏదో ఒకటి అరా తప్పితే, స్పీకర్ పదవికి గౌరవం ఇస్తారు. స్పీకర్ పదవి రాజ్యంగబద్ధ పదవి కావటంతో, రాజకీయాలు ఎవరూ మాట్లాడారు. అయితే తమ్మినేని మాత్రం మొదటి నుంచి, దూకుడుగా ఉంటూ వస్తున్నారు. ఏకంగా పచ్చి బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక చంద్రబాబు మీదకు అయితే, ఒంటి కాలు మీద వెళ్ళిపోతూ ఉంటారు. రాజ్యాంగాబద్ధ పదవుల్లో ఉంటూ, మరో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి పై విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కులం పేరుతో తిట్టటం చూసాం. ఇక తాజాగా, న్యాయ వ్యవస్థ పై కూడా ఆయన విమర్శలు చేసారు. వీటి అన్నిటి నేపద్యంలో, స్పీకర్ గా ఉంటూ, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది.
అయితే ఇప్పుడు మరో న్యూస్ వెలుగులోకి వస్తుంది. తమ్మినేని సీతారం, మంత్రి పదవి కోసం, లాబీయింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా, ఒకే అని చెప్పారని వార్తలు వస్తున్నాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ త్వరలో మంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. ఆ పదవులు భర్తీ విషయంలో, తమ్మినేని తనకు అవకాసం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే తమ్మినేని గట్టిగా మాట్లాడుతూ ఉండటం, ధీటుగా సమాధానం చెప్తారు కాబట్టి, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుటుందని అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ బీసీ అస్త్రం ఉపయోగిస్తున్న సమయంలో, గట్టిగా మాట్లాడే తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని, అలాగే ఉత్తరాంధ్ర నుంచి, మూడు రాజధానుల విషయంలో కూడా తమ్మినేనితో కౌంటర్ అటాక్ చేపించవచ్చని, అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. మొత్తానికి, తమ్మినేని కోరిక నెరవేరుతుందా ? ఆయన విజ్ఞప్తికి, జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ? చూడాలి.