ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వం చేతకాని తనం వల్ల, ఇసుక మాఫియా వల్ల, ఇసుక కొరత ఎర్పటడంతో, ఇబ్బందులు పడుతున్న 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 12 గంటలు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ ధర్నా చౌక్ లో, చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ దీక్షకు, పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చి మద్దతు తెలుపుతూ, వారు పడుతున్న బాధలు చెప్తున్నారు. ప్రతిసారి జరిగే దీక్షలకు భిన్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నాయకులు కాకుండా, ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ, తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఆరు నెలల నుంచి కడుపులు కాలి, సమాజంలో ఇబ్బందులు పడుతూ, బ్రతుకు గడవక, ఆత్మాభిమానం చంపుకోలేక వీరు పడుతున్న ఇబ్బందులు, వీరి మాటల్లో తెలిసింది. సామాన్యుడి కడుపు కాలితే, వాళ్లకి సియం ఆయినే ఒకటే, ఎవరైనా ఒకటే అనే విధంగా, ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని దుమ్ము దులిపారు.
చాలా మంది కార్మికులు వారి సమస్య చెప్తూ, ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తారు. ముఖ్యంగా సుశీలమ్మ అనే కార్మికురాలు మాటలు, ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న కోపాన్ని చెప్పాయి. తన మనవడు పనులు లేక ఆత్మహత్య చేసుకున్నారని, ఈ రోజు దినం కార్యక్రమం ఉన్నా, ఆటో కట్టుకుని, ఇక్కడకు వచ్చానని, నా మాటలు ఈ ప్రభుత్వం వినాలి అని, ఇంత కష్టపడి వచ్చానని చెప్పారు. కేవలం ఇసుక లేక, పనులు లేక, అల్లాడిపోతున్నామని అన్నారు. ఇంట్లో మగవాళ్ళు జీవత్సవాలుగా మారిపోయారని, ఇళ్ళకు వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతామో అని, రోడ్ల మీద ఉంటున్నారని అన్నారు. పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని, అప్పు కూడా పుట్టక, ఇంట్లో వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చామని, ఇంకో రెండు నెలలు పొతే, ఇక మా జీవితాలు ముగించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా జగన్ పై విరుచుకు పడ్డారు. ఇంత మండి ఉసురు పోసుకుని, మీరు బాగుపడరని, ఏ ప్రజలు గద్దెను ఎక్కించారో, వారే నిన్ను కుల్చేస్తారని అన్నారు. నీకు పాలించటం చేతకాదు దిగిపో, నేను ఒక సామాన్యురాలుగా చెప్తున్నా, నేను సియంగా ఒక్క రోజు చేసినా, ఇసుక సమస్య ని లైన్ లో పెడతా, నువ్వు దిగిపో అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇలాగే మిగతా వారు కూడా, తమ పరిస్థితిని తలుచుకుని, ఈ దీన పరిస్థితికి జగనే కారణం అంటూ విరుచుకు పడ్డారు. సామాన్యులు, అదీ కూలి పని చేసుకునే కూలీలు, ఇలా ప్రభుత్వాన్ని ఎదురు తిరిగి, చీల్చి చెండాడుతున్నారు అంటే, వీరి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. జగన్ లాంటి బలమైన నేతను ఇలా బహిరంగంగా, విమర్శలు చేస్తున్నారు అంటే, సామాన్యుడి కడుపు మాడితే, ఇలాగే ఉంటుంది. జగన్ అధికారానికి భయపడి, పేదల తరుపున పోరాడకుండా పారిపోతున్న టిడిపి నేతలు, ఇలాంటి సామాన్యులను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలని, టిడిపి కార్యకర్తలు అంటున్నారు.