రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 45 రోజులు అవుతుంది, అప్పుడే మంత్రుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే దాక వెళ్లారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం తప్పులు చేసిందని, మేము అన్ని విధాలుగా చూసుకుంటాం అని ప్రజలను నమ్మించి, ఓట్లు వేసుకుని, ఇప్పుడు వారి చావులకు కారణం అవ్వటం, నిజంగా ఆందోళనకరం. మచిలీపట్నంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలో నివసిస్తున్న జయలక్ష్మి అనే మహిళ, మంత్రి పేర్ని నాని తన చావుకు కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి, ఆత్మహత్యాయత్నం చేసారు. అయితే ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. జయలక్ష్మీ సూసైడ్ నోట్ ప్రకారం, మంత్రి పేర్ని నాని, మట్టా తులసి తనను వేధిస్తున్నారంటూ, ఇలాంటి బ్రతుకు తనకు వద్దు అని లేఖ రాసి నిద్ర మాత్రలు మింగారు.
ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆంధ్రా హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. చికిత్స మొదలు పెట్టిన డాక్టర్లు, 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ లో, ఈ ప్రభుత్వం ఒక ఆడదాని మీద కక్ష కట్టింది. మంత్రి పేర్ని నాని, ఒక ఆడ పిల్ల మీద కక్ష సాధింపు చేసే నాయుకుడు. నా చావుకి, పేర్ని నాని, మట్టా తులసి, అంగన్ వాడీ టీచర్ యేసు కుమారి, ఆశ వర్కర్ వెంకటేశ్వరమ్మ కారణం. వీరు నన్ను బ్రతకనివ్వటం లేదు. అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నా. నా భర్తను బాగా చూసుకోండి అంటూ లేఖ రాసారు. అయితే, ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంత్రి దీని పై ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.