వైస్ జగన్ పాదయత్ర జరుగుతున్న విషయం తెలిసిందే... అయితే అది పాదయత్ర లేక ముద్దుల యాత్ర అనే విమర్శలు కూడా వస్తున్నాయి... దానికి తోడూ జగన్ కూడా అలాగే, కనిపించిన ప్రతి వారికి ముద్దులు పెడుతూ, ముందుకు పోతున్నారు. జగన్ అనంతపురం పాదయాత్రలో ఇలాంటే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగన్ కదిరి నియోజకవర్గంలోని, ఎన్పీకుంట మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అనూహ్య ఘటన జరిగింది. జగన్ పాదయాత్ర సాగుతున్న వేళ, ఓ మహిళ ఉన్నట్లుండి జగన్ మీదకు దూకడం సెక్యూరిటీ వర్గాలను కలవరపెట్టింది. జగన్ ను ముద్దాడేందుకు ఓ మహిళ సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని మరి దూకేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని ఒక్కసారిగా దూకడంతో జగన్ సిబ్బంది ఆమెని జగన్ కు ముద్దు పెట్టకుండా ఆపారు.
అయితే జగన్ మాత్రం ముందు ఏమి జరుగుతుందో అర్ధం కాక, ఖంగారు పడినా, తేరుకుని, ఆ మహిళ ఉత్సాహాన్ని గమనించిన జగన్ సిబ్బందిని వారించాడు. ఆ మహిళని విడచి పెట్టాలని కోరాడు. ఆమెను దగ్గరకు తీసుకుని యధావిధిగా తన ట్రేడ్ మార్క్ ఓదార్పు స్టైల్లో నుదుటి మీద ముద్దాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడైనా సెలబ్రిటీలు, అందులోనూ రాజకీయ నాయకులతో అయితే, వారిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటానికో, లేకపోతే ఫోటో దిగటానికి ఉత్సాహపరుస్తునారు. కాని, జగన్ కు మాత్రం, ఆయన నుంచి తన ట్రేడ్ మార్క్ ఓదార్పు స్టైల్లో ముద్దు కోసం, ఆయన అభిమానులు ఉత్సాహం చూపుతూ ఉంటారు.
అయితే వీటి పై సొంత పార్టీ మహిళా కార్యకర్తలే జగన్ ను పలు సందర్భాల్లో అలా చెయ్యటం తప్పు అని చెప్పారు... హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయినా తరువాత మహిళలు పరాయి పురుషుని పక్కన కూర్చోవడానికి ఆలోసిస్తారు... ఇలాంటి ముద్దుల సంస్కృతి రాజాకీయాల్లో ఎప్పుడూ లేదు... వృద్దులు, మహిళలు, అమ్మాయిలకు 'ముద్దుల"తో కొత్త "విదేశీ సంస్కృతి" కి "వైస్ జగన్" తెర తీసారు అని, అలా చెయ్యకుండా వీలైనంత వరకు వారికి shake hand ఇవ్వండి.. కాని ముద్దులు పెట్టకండి.. ముద్దులు పెట్టటం అనేది బాబాలు, మత ప్రబోధకులు.. చేసే పని.. మీరు చెయ్యటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాది." అంటూ జగన్ కు వాళ్ళ పార్టీ అభిమానులే ట్వీట్ చేశారు.