ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. 'మళ్లీ మీరే రావాలి' అంటూ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు.. అక్కాచెల్లెళ్లే తన బలమని చెప్పుకుంటున్నారు. తనను గెలిపించే బాధ్యత వాళ్లే తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుతోంది. ఊరూరా జనాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. అయితే.. జనం మాత్రం ఎటువైపు మొగ్గుచూపాలో స్పష్టంగా డిసైడయ్యారు. ఎవరు మాటలకే పరిమితమవుతారు ? ఎవరు చేతల్లో చూపిస్తున్నారు ? అన్న విషయంలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్లముందు కనిపిస్తున్న ప్రగతి, సంక్షేమం ముందు.. బయటినుంచి వచ్చి ఎవరు ఏం చెప్పినా వృథా ప్రయాసే అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

game 27032019

ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతోంది మహిళాలోకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రతి సభకూ మహిళలు వెల్లువలా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు ముగ్ధులవుతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాము పొందిన లబ్దిని గుర్తు చేసుకుంటున్నారు. తమకు తాము నెమరు వేసుకోవడమే కాదు.. బాహాటంగా సభలో చెబుతున్నారు. మహిళలు, ప్రధానంగా వృద్ధులు చంద్రబాబు సభావేదికపైకి ఎక్కి 'మళ్లీ మీరే రావాలి' అంటూ ఆశీర్వదిస్తున్నారు. తమ ప్రత్యక్ష అనుభవాలను జనం ముందుకు తీసుకువస్తున్నారు. ఇది.. స్వయంగా ఓ వృద్ధురాలు చెప్పిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తున్న పెన్షన్‌తోనే బతుకుతున్నానని, బాబు వస్తున్నారని తెలిసి.. మళ్లీ ఆయనే రావాలంటూ పార్టీ నేతలతో కలిసి కొబ్బరికాయ కూడా కొట్టానని చెప్పుకొచ్చింది.

 

game 27032019

ఇది ఏ ఒక్కరో చెబుతున్న విషయం కాదు.. ఏ జిల్లాకు వెళ్లినా.. ఏ ఊళ్లో సభ నిర్వహించినా.. ఇలాంటి కథలు వినిపిస్తున్నాయి. ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకుంటానంటూ తమలాంటి పెద్దవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భరోసా మాటలకే పరిమితం కాదని, కళ్లముందు సాక్షాత్కరిస్తోందని ఆనందంగా చెబుతున్నారు. వాస్తవానికి మహిళా సెంటిమెంట్‌ను మించినది ఏదీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా సెంటిమెంట్‌ అడుగడుగునా హారతులు పడుతోంది. మహిళలు ఉవ్వెత్తున భావోద్వేగానికి గురవుతున్నారు. డ్వాక్రా, పసుపు కకుంకుమ, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు ఇలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల జడిలో తడిసిముద్దవుతున్నారు. చంద్రబాబుకు జై కొడుతున్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా హిట్‌ అవుతుంది. సాధారణంగా మహిళలకు రీచ్ అయితే, వాళ్ల ఆదరణ చూరగొంటే ఏదైనా సూపర్‌ హిట్‌ అవుతుంది. మొత్తానికి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలకు మహిళలు పోటెత్తుతున్నారు. చంద్రబాబు ప్రచార స్ట్రాటజీ కూడా మహిళల చుట్టూరా తిరుగుతోంది. ఆడపడుచుల అండతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. మహిళా సెంటిమెంట్‌ ప్రభంజనం వెల్లువలా పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేడీస్‌ ఓటు బ్యాంక్‌ టీడీపీదే అన్న అంశం ఖాయమైపోయిందంటున్నారు విశ్లేషకులు. ఓవైపు సంక్షేమ పథకాల ఫలాలు, మరోవైపు లబ్దిదారుల స్పందన దీనికి నిదర్శనమంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read