కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనపై ఏపీ టీడీపీ ఎంపీల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేశారని ఎంపీలు దుయ్యబట్టారు. పాత కథనే మళ్లీ వినిపిస్తున్నారని, ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు... కాగా, రాజ్యసభ వాయిదా అనంతరం, లాబీల్లో కొంచెం సేపు కలకలం రేగింది... ఒకేసారి వాతావరణం వేడెక్కింది.... పార్లమెంట్ లో జైట్లీ ప్రకటన తరువాత, రగిలిపోతున్న నేతలకు, జైట్లీ ప్రశ్నతో మరింత కాక రేగింది... జరిగిన విషయం ఏంటి అంటే...
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీకి, సుజనా చౌదరికీ మధ్య వాగ్వివాదం జరిగింది.... లోక్-సభ, రాజ్యసభలో రెండు సార్లు ప్రకటన చేసినా మీరు సంతృప్తి చెందరా ? ఇలా అయితే ఎలా అంటూ, సుజనా పై, జైట్లీ మండిపడ్డారు.. దీంతో, సుజనా కూడా అంతే ధీటుగా స్పందించారు... డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయ్యలరు అని జైట్లీతో సుజనా వాదనకు దిగారు... పార్టీలు ఉంటాయి, పోతాయి, కానీ, ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటూ తీవ్ర స్వరంతో సుజనా స్పందించారు...
ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుకున్నది ప్రజల మద్దతుతో సాధిస్తామని, మీరు నిర్దిష్ట హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తూనే ఉంటామని తెగేసి చెప్పినట్లు సమాచారం... సుజనా ఈ విధంగా నిరసన తెలపటంతో, కొంచెం సేపు అక్కడ వాతావరణం వేడెక్కింది... వెంటనే పక్కనే ఉన్న మిగతా రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదిరిని వారించి, అక్కడ నుంచి పంపించి వేసారు... తాము మిత్రపక్షంలో ఉన్నప్పటికీ, నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ జైట్లీ సరైన ప్రకటన చేయలేదని పార్లమెంట్ లో ఎంపీలు కూడా, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు...