Sidebar

16
Sun, Mar

అమరావతికి రుణం ఇవ్వం అంటూ కొద్ది రోజులుగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఎవరికీ వారు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మీడియా అయితే, కేవలం చంద్రబాబు వల్లే ఈ రుణం ఆగిపోయింది అని, చంద్రబాబు అమరావతిలో అవినీతి చేసారని, అందుకే రుణం ఆపేసారని, చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన విషయం ప్రపంచ బ్యాంకుకు తెలిసిపోయి, రుణం ఆపేసారని. విష ప్రచారం చేసారు. అయితే ఈ వాదనలకు తెర దింపుతూ ప్రపంచ బ్యాంక్ ఈ రోజు ఒక ప్రకటన విడుదుల చేసింది. రుణం ఆపటానికి కారణం, భారత ప్రభుత్వం అంటూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం జూలై 15 వ తారీఖున వెనక్కు తీసుకుందని, అందుకే రుణం ఇవ్వలేం అని చెప్పామని చెప్పింది.

wb 21072019 2

అయితే రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నుంచి మాత్రమే తప్పుకున్నాం అని , ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మేము, మా సహయం కొనసాగిస్తాం అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాలు అయిన, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇప్పటికే అనేక బిలియన్‌ డాలర్ల రుణ సహాయం అందించామని, ఇది ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పింది. ఆరోగ్యం విషయంలో గత నెలలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్పింది. అయితే ఈ విషయం పై గత రెండు రోజులుగా చంద్రబాబు టార్గెట్ గా వైసిపీ ఆడిన ఆటలు అన్నీ అబద్ధం అని తేలిపోయింది. వైసిపీ నేతలు, చంద్రబాబు వల్లే అమరావతికి రుణం ఇవ్వలేదంటూ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.

wb 21072019 3

అయితే అది తప్పుడు ప్రచారం అని తేలింది. మరో పక్క, ఈ రోజు జగన్ మీడియాలో బ్యానేర్ ఐటెంగా, అమరావతి రుణం పై వండి వార్చారు. చంద్రబాబు అవినీతి వల్లే అమరావతికి రుణం ఇవ్వలేదని చెప్పి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జగన్ విజన్ కు ఆకర్షితులు అయ్యారని చెప్పింది. అంతే కాదు, జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రపంచ బ్యాంకుకు ఎంతో నచ్చాయని, వాటికి రుణం ఇవ్వటానికి ప్రపంచ బ్యాంక్ సిద్దంగా ఉందని చెప్పింది. నిజానికి ప్రపంచ బ్యాంక్ ఇలాంటి పధకాలకు రుణం ఇవ్వదు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంక్ ప్రకటన విడుదల చెయ్యటం, కేంద్రం వల్లే మేము ఇవ్వలేక పోయామని చెప్పటం, భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి చెప్పటంతో, జగన్ మీడియా చెప్పేవి అన్నీ అబద్ధాలే అని మరోసారి రుజువైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read