రాజధాని అమరావతి విజ్ఞాన ఖనిగా మారబోతుంది. ఇప్పటి కే జాతీయస్థాయి గురింపు పొందిన విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థలు ప్రవేశించి బోధనను ఆరంభించిన సంగతి తెలిసిందే. మరో పక్క అమృత యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క, రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ వస్తోంది. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) సంస్థ అమరావతిలోని ఐనవోలు సమీపంలో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఎకరం రూ.10 లక్షల చొప్పున 50 ఎకరాలు కేటాయించింది.

amarvati 03102018 2

మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ.. భువనేశ్వర్‌లో రెండో క్యాంపస్‌ ఏర్పాటు చేసింది. మూడో ప్రాంగణాన్ని ఇప్పుడు అమరావతిలో ప్రారంభిస్తోంది. మొత్తం విద్యార్థులు: 5 వేలు.. కోర్సులు: మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు.. అకడమిక్‌ బ్లాక్‌: 17 ఎకరాల్లో జీ+5 విధానంలో నిర్మిస్తారు. 84 తరగతి గదులు, 7 లెక్చర్‌ హాళ్లు, 500 ఫ్యాకల్టీ కార్యాలయాలు, 40 కాన్ఫరెన్స్‌ రూంలు, మినీ ఆడిటోరియం, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటివి ఉంటాయి.

amarvati 03102018 3

ఇవికాకుండా పరిపాలన విభాగం, గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, ఇంటర్నేషనల్‌ సెంటర్‌, వినోద, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు... డిగ్రీ, పీజీ విద్యార్థులకు జీ+15 అంతస్తుల్లో వేర్వేరుగా హాస్టల్‌ భవనాలు; బోధన, బోధనేతర సిబ్బందికి జీ+17 విధానంలో నివాస భవనాలు నిర్మిస్తారు. మరో పక్క, అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు, అకాడెమీలు, క్రీడా వసతులతో అమరావతిని ప్రపంచంలో అగ్రగామి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా అమరావతిలో ప్రత్యేకంగా క్రీడా నగర (స్పోర్ట్స్‌ సిటీ) అభివృద్ధికి మెకన్సే సంస్థ ఒక వ్యూహ పత్రం సిద్ధం చేసింది. స్పోర్ట్స్‌ సిటీలో రెండు దశల్లో క్రీడా వసతులను అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన.

Advertisements

Advertisements

Latest Articles

Most Read