ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు ఇంకా కాలేదు. రకరకాల కారణాలతో ప్రభుత్వం, ఈ నియామకం చేపట్టలేదు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కలిసి ఉంటారు. అందరూ కలిసి ఎన్నుకోవలసి ఉంటుంది. అయితే ఈ నియామకం లేట్ అవుతూ వస్తూ ఉండటంతో, ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు రెడీ అయ్యింది. దీని కోసం, ఈ రోజు మొదటి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబుని, అలాగే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడిని కూడా ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ రోజు సచివాలయంలో ఈ సమావేశం ఉంటుంది, ఈ సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు, యనమలకు, శాసనసభ స్పెకర్ కు, శాసనమండలి స్పీకర్ కు, ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు, యనమల వస్తారా రారా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా, ఈ సమావేశం పై టిడిపి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మనవ హక్కుల కమిషన్ ఏర్పాటు పై, ప్రభుత్వ వైఖరి పై ఒక ప్రకటన విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ సమావేశానికి హాజరు కావటం లేదని తేల్చి చెప్పారు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు యనమల చెప్పారు. రాజ్యాంగం అంటే కనీస గౌరవం లేని జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మేము ఎలా వస్తాం అనుకున్నారు అంటూ, యనమల ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు కానీ, రాజ్యాంగ హక్కులు కానీ లేవని, జగన్ రెడ్డికి ఇవి అసలు తెలియదని, ఆయన చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు సంబంధం లేదని, వీళ్ళు హక్కులు గురించి చర్చించటం హాస్యాస్పదంగా ఉంటుంది అంటూ, యనమల అన్నారు. రాష్ట్రంలో అసలు మానవ హక్కులు అనేవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఎవరికీ హక్కులు ఉన్నాయని, అన్ని వ్యవస్థలు నాసనం అయ్యాయని అన్నారు. ప్రజలు స్వేచ్చగా బ్రతికే పరిస్థితి లేదని, మీడియాకు కూడా హక్కులు లేకుండా చేసారని అన్నారు. చివరకు ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేసిన ఇలాంటి వ్యక్తి మానవ హక్కులు అనటం హాస్యాస్పదంగా ఉందని యనమల అన్నారు.