ఆర్థిక వ్యవస్థ అనేది అత్యంత ప్రధానమైన రంగం. ఇది ప్రతి ఒక్కరి కుటుంబంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అప్పులపై ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు నేను సిద్ధం. 25 ఏళ్లపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న అనుభవాన్ని బాధ్యతవున్న వ్యక్తిగా చెబుతుంటే పదే పదే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడంలేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవంకాదా? గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి మరోసారి అబద్ధ ప్రచారానికి తెరలేపారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, సంక్షేమం కన్నా అప్పులు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. స్వాతంత్యం వచ్చిన తరువాత అప్పుడున్న ప్రభుత్వాలు 1956 నుంచి 2019 వరకు చేసిన అప్పులు రూ. 2 లక్షల 53వేల కోట్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38వేల కోట్లు అప్పు చేసింది. (అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లు) వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయి.

జగన్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి ఈ అప్పు రూ.11 లక్షల కోట్లకు పైగా చేరుతుంది. టీడీపీ హయాంలో చేసిన మొత్తం అప్పు 5 సంవత్సరాలలో రూ.1,63,981 కోట్లు. అనగా సంవత్సరానికి సరాసరి చేసిన అప్పు రూ.32,800 కోట్లు. వైసీపీ 3 సంవత్సరాల 8నెలల కాలంలో అప్పు రూ.1లక్షా 32వేల కోట్లు ఉంది. తెదేపా హాయంలోని 4 శాతం ద్రవ్య లోటు నుండి 9.6 శాతంకు పెరగడం జగన్ రెడ్డి ఘనత. తెదేపా హయాంలోని అప్పులలో ఎక్కువ భాగం కేపిటల్ ఎక్స్ పెండెచర్ కు కేటాయించగా వైకాపా హయాంలో అప్పులను రెవెన్యూ ఎక్సపెండేచర్ కు ఖర్చు చేశారు. 2019-20లోనే రూ.26 వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను బడ్జెట్ లో చూపించలేదని ఆడిట్ తప్పు పట్టింది. 2020-21లో, 2021-22లో ఎంత మేరకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయో కాగ్ కు కూడా చూపకుండా వాస్తవాలను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్ లు, వివిధ సంస్థల ద్వారా తీసుకొస్తున్న అప్పుల లెక్కలను చూపకుండా దాచిపెడుతున్నారు. కార్పొరేషన్ ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు హాజరై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని భావిస్తున్నాను.

Advertisements

Advertisements

Latest Articles

Most Read