ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేయగానే, ఆదరాబాదరగా మీడియాముందు కు వచ్చిన జగన్, తన అక్కసునంతా వెళ్లగక్కి, కరోనా రాష్ట్రంలో ఎక్కడుందంటూ విపరీత ధోరణితో మాట్లాడాడని, ఆయన తన వింతచేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా డని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరస్థాయిలో ఉందంటే రాష్ట్రప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ పట్టించుకోలేదన్నారు. ప్రజలను రక్షించాలన్న ఆలోచన చేయకుండా, ఎన్నికల కోసం, ఎన్నికల కమిషనర్ పై ముఖ్యమంత్రి నిందలేశాడన్నారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు, ఇతర ప్రభుత్వపెద్దలు గానీ వెల్లడించలేదన్నారు. మనుషుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ప్రపంచ దేశాధినేతలందరూ మీడియా ముందుకు వచ్చి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, కరోనా జాగ్రత్తలు వారికి వివరించడం, తమ తమదేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, తనదారిలో తాను వింతపోకడతో ముందుకు సాగుతున్నాడ న్నారు. కరోనా ప్రభావం అంత సీరియస్ గా ఉంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కమాట కూడా దాని గురించి మాట్లాడలేదన్నారు. ఎన్నికల్లో ఎలా దౌ-ర్జ-న్యాలు- చేసి, తనపార్టీని గెలిపించుకోవాలన్న తాపత్రయం తప్ప, ముఖ్యమంత్రిలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు లేవన్నారు.

సీఎం ఇంట్లో కూర్చొని, ఎవరు ఏ లేఖరాశారు.. ఎవరు చెబితే రాశారు.... తెలుగుదేశం ఏం చేస్తోందన్న ఆరాలు తీస్తున్నాడు గానీ, కరోనా ప్రభావంపై నామమాత్రం కూడా దృష్టి పెట్టడంలేదన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, తద్వారా ప్రభుత్వానికి చీవాట్లు మిగిలాయన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు అధికారపార్టీకే ఏకగ్రీవమయ్యాయని, అధికారులు, పోలీస్ వ్యవస్థ సహాయసహాకారాలతో కొన్నిప్రాంతాల్లో 75శాతం పైగా స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యమవుతుందని యనమల ప్రశ్నించారు. ఈ ఏకగ్రీవాలు చూస్తుంటేనే వైసీపీ ఏ స్థాయిలో దౌ-ర్జ-న్యా-లు చేసిందో అర్థమవుతోందన్నారు. ఏకగ్రీవాలపై ప్రతిపక్షంనుంచి వచ్చిన ఎన్నికలఫిర్యాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలే దని, చాలాస్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్ కే ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. ఎన్నికలు వాయిదావేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారనే భయంలో వైసీపీ ఉందన్నారు. అలా జరిగితే వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో కేంద్ర బలగాల ప్రస్తావనతో పాటు, తన భద్రతగురించి కూడా చెప్పడం జరిగిందన్నారు.

ఏకగ్రీవమైన స్థానాలను అడ్డుపెట్టుకొని, ఏదోరకంగా ఎన్నికలు నిర్వహింపచేసుకోవాలన్న దురుద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో, ఒక్క వైసీపీమినహా, అన్ని పార్టీలవారు నేడు గవర్నర్ ని కలవబోతున్నా రని, వారంతా కూడా తిరిగిఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూశాక, తనకున్న విచక్షణాధికారంతో ఎన్నికలు వాయిదావేయాలని ఎన్నికల కమిషనర్ లేఖ రాస్తే, దానిపై వైసీపీ ఎందుకింతగా ఉలిక్కి పడుతుందని యనమ ల ప్రశ్నించారు. ఒకవేళ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తే, రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని, దాంతో తమఆటలుసాగవన్నభయంతోనే వైసీపీ బెంబేలెత్తిపోతుం దన్నారు. ఆభయంతోనే ఎన్నికల కమిషనర్ ని, ఎన్నికలసంఘాన్ని దుర్భాషలాడు తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అ-రా-చ-కా-లు, దౌ-ర్జ-న్యా-లతో- పాటు, అనేకస్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రభుత్వం చేసిన దురాగతాలను ఎన్నికల కమిషనర్ తనలేఖలో ప్రస్తావించాడని, తనకు, తనకుటుంబానికి ము-ప్పు ఉన్నందున భద్రత పెంచాలనికూడా ఆయన విజ్ఞప్తిచేశాడన్నారు. దానిలో తప్పేముందో... ఈసీ లేఖపై ప్రభుత్వం ఎందుకింతలా గింజుకుంటుందో తెలియడంలేదన్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే, ఎన్నికల కమిషనర్ ఢిల్లీ తలుపుతట్టాడని, ఈసీ రాసిన లేఖపై ప్రశ్నించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి ఎక్కడిదని యనమల నిలదీశారు. ప్రాధాన్యత పోస్టుల్లో 250మంది రెడ్లను పెట్టుకొని, ఎన్నికల నిర్వహణను కూడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలైన రెడ్లకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, కులాల పేరుతో గిట్టనివారిపై దాడిచేయడం ఎంతవరకు సమంజసమని రామకృష్ణుడు నిలదీశారు. కుల రాజకీయాల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేనేలేదన్నారు. రాజ్యాంగంలో ప్రభుత్వ పరిధేమిటో తెలుసుకోకుండా, ఫా-సి-స్టు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నారు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని అడ్డంపెట్టుకొని దోచేయడానికి, ప్రజలను నాశనం చేయడానికే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు తప్ప, ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా గురించి, ముఖ్యమంత్రిగానీ, ఆరోగ్యశాఖా మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి గానీ ఎవరూ మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నఅభివృద్ధి పనులను కొనసాగించవచ్చని, కొత్తగా వేటినీ ప్రారంభించడానికి అవకాశం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. వ్యక్తిగతలబ్ధి చేకూర్చే పథకాలు, కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగిందన్నారు. తాను స్పీకర్ ననే విషయం మర్చిపోయి, ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, ఆయనపై పై పరువునష్టం దావా వేయవచ్చన్నారు. వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తే, రాజకీయ నాయకుడిలా మారిపోయి, స్పీకర్ ననే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే, ఆయన్ని ప్రశ్నించే అధికారం ప్రతిపౌరుడికి ఉంటుందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read