గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడి హత్యకు కుట్ర యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిందితులు శ్రీనివాసరావు, శివకృష్ణ, పూర్ణచంద్రరావుల నుంచి రివాల్వర్‌, రెండు తపంచాలు, ఎనిమిది తూటాలు, ఆరు పిల్లెట్స్‌తోపాటు కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గుంటూరు పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న నల్లబోతుల శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే యరపతినేనికి అనుచరుడిగా వ్యవహరించి, కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఇందుకు కారణం ప్రస్తుత ప్రధాన అనుచరుడు వెంకటేశ్వరరావే అని భావించి కక్ష పెంచుకున్నాడు.

bjp 25032019

దీంతోపాటు ఓ భూవివాదంలో వెంకటేశ్వరరావుకు, శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. మరో నిందితుడు శివకృష్ణకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వారి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఇందులో వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని, తనను హత్యచేసేందుకు కూడా కుట్ర చేశాడని శివకృష్ణ భావించాడు. ఈ నేపథ్యంలో నలబోతు శ్రీనివాసరావు, శివకృష్ణలు వెంకటేశ్వరరావు హత్యకు పథకం రూపొందించారు. శివకృష్ణ బావమరిది పూర్ణచంద్రరావు కూడా ఇందుకు సహకరించాడు. ఈ నెల 22న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం ఖరారుచేసుకోవటంతో అదే సమయంలో వెంకటేశ్వరరావును హత్య చేయాలని పఽథకం రూపొందించి ఆయుధాలను సమకూర్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కుట్రను భగ్నం చేశారు. పిస్టల్స్‌ను ఆగ్రాలో విఘ్నేష్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ కారణాలు, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావాల్సి ఉందన్నారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు.

 

bjp 25032019

హత్యకు కుట్ర భగ్నం కేసులో పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. నామినేషన్‌ దాఖలు సమయంలో వెంకటేశ్వరరావుతో పాటు తేడా వస్తే ఎమ్మెల్యేను కూడా చంపాలని వారు పథకం రూపొందించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా నిందితులు కడపకు చెందిన వారితో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడకు వెళ్ళి వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కొద్ది నెలల నుంచే పల్నాడు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున బైండోవర్లు, ముందస్తు అరెస్టులు, విస్తృత తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నిఘా వర్గాలు ఈ కుట్రను ముందస్తుగా గుర్తించాయి. దీంతో ఎన్నికల వేళ పెను ప్రమాదం తప్పింది. ఈ విషయమై ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందిస్తూ ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read