తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీలోకి జంప్ అయిన కొద్ది సేపటికీ, ఆ ఎంపీలు చేస్తున్న బెదిరింపులు, బీజేపీ పార్టీ అధికార అహంకారాన్ని తెలియ చేస్తున్నాయి. తనను ఢిల్లీ నుంచి ఫోన్ లో బెదిరిస్తున్నారు అంటూ, వారి పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఆ ఎంపీలు నిన్నటి నుంచే తనను బెదిరిస్తున్నారని, ఎమ్మెల్సీవి ఎమ్మెల్సీగా ఉండాలని, అన్నిట్లో దూరితే పరిణామాలు వేరుగా ఉంటాయని బెదిరించారని ఆయన ఆరోపించారు. హిందీ భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ బెదిరింపులు చేసినట్టు చెప్తున్నారు. ఆయన్ను అడ్డుపెట్టుకుని, సుజనా ఇంటి నుంచే తనను బెదిరిస్తున్నారని, ఫోన్ చేసి కేసులు పెడతాం, బోల్టులు బిగిస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. అర్థరాత్రి 10.45 నిమిషాలకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఫోన్ చేసి తనను బెదిరించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నలురుగు రాజ్యసభ సభ్యుల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చారన్నారు.
వాళ్ళు పార్టీ మారిన గంటలోనే తమకు బెదిరింపులు మొదలయ్యాయని, తమ అధ్యక్షుడు చంద్రబాబు కోసం ప్రాణాలు ఇస్తానని, జైలుకైనా వెళ్తామని, ఆయన అంటే అంత గౌరవం అని బుద్దా అన్నారు. తనపై కేసులు పెట్టి లోపల వెయ్యటానికి తానేమి బ్యాంక్ దోపిడీలు, బ్యాంకులను చీటింగ్ చెయ్యటం చెయ్యలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో వైసీపీని ఇతర పార్టీ నేతలను రాజకీయం విమర్శలు చేసామని, అయితే మెుదటి సారిగా ఇలా తాన పై బెదిరింపులకు పాల్పడ్డానని ఆయన ఆరోపించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనతో బాగానే ఉంటాడని, మంచి సంబంధాలు ఉన్నాయని, కాలి ఇలా ఎందుకు ఫోన్ చేసి బెదిరించారో అర్ధం కావటం లేదని అన్నారు. తనకు వచ్చిన బెదిరింపుల పై శనివారం ఉదయం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎవరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత బెదిరించినా చంద్రబాబు వెంటే ఉంటానని, చేతనైంది చేసుకోండి అని తేల్చి చెప్పారు.