రాజకీయ నాయకులు ఒక మాట మీద ఉండరు అనేది అందరికీ తెలిసిందే. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి మాటలు మారుస్తూ ఉంటారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం మరీ పది రోజులు కూడా ఒక మాట మీద ఉండటం లేదు అధికార పార్టీ నేతలు. మళ్ళీ మాట తప్పం, మడమ తిప్పం అంటూ,బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారు. విషయానికి వస్తే కేంద్రం తెచ్చిన రైతు చట్టాల విషయంలో దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రధాని మోడీ, అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగి, పరిస్థితి చక్క దిద్దే పరిస్థితి వచ్చింది. సహజంగా మోడీ, షా అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి మాట వినరు. ఎవరు వద్దు అని చెప్పినా, వారు చెయ్యాలి అనుకున్నదే చేస్తారు. అయితే మొదటి సారి వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి రావాల్సి వచ్చింది. అంతటి సీరియస్ సబ్జెక్ట్ ఇది. రైతులు గట్టిగా నిరసనలు తెలిపితే, బీజేపీ ప్రభుత్వం షేక్ అవ్వటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు అంటే, అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యతిరేకత అర్ధం అయ్యే మొన్న రైతులు ఇచ్చిన భారత్ బంద్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కూడా మాట మార్చి, రైతుల బంద్ కు మద్దతు తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు వైసిపీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అయితే, బీజేపీని ప్రసన్నం చేసుకోవటానికి, ఏకంగా కాంగ్రెస్ పార్టీని దళారీ అంటూ టార్గెట్ చేసారు.
అంతలా భజన చేసి, చివరకు రైతులు భారత్ బంద్ కు మద్దతు ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అమిత్ షా, జగన్ ను ఢిల్లీ రమ్మన్నారు అని వార్తలు వచ్చయి. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రజలకు అవగాహన కలిగిచటంలో మద్దతు కావాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అంతే జగన్ ఢిల్లీ నుంచి వచ్చారో లేదో, బీజేపీ కంటే ఎక్కువగా వ్యవసాయ బిల్లులకు మద్దతుగా వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. రైతులు బంద్ కు మద్దతు ఇచ్చి, పట్టుమని పది రోజులు కూడా అవ్వకుండానే, ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ, కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో అపోహలు వద్దని, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, కొత్త వ్యవసాయ చట్టాలతో ఎంతో మేలని, ఇప్పుడున్న మార్కెట్ యార్డులకు వచ్చే ఇబ్బందులు ఏమి లేవని, అపోహలు మానుకోవాలి అంటూ, వ్యవసాయ చట్టాల పై రైతులకు అవగహన కల్పించారు. ఇలా రోజుకి ఒక విధంగా వైసీపీ మాట్లాడటంతో, అసలు వీళ్ళ స్టాండ్ ఏమిటో అర్ధం కావటం లేదు.