పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పై చర్చకు రావాలంటూ టీడీపీ సవాలు విసరటంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పులివెందులలో ఘర్షణలో చెయ్యాలన్న వైసీపీ ప్లాన్ సక్సెస్ అయ్యింది... పొద్దున్న నుంచి, పోలీసులు ఎంతో జాగ్రత్త తీసుకున్నా, చివరకు ఆ పోలీసుల మీదే దాడులు చేసింది జగన్ గ్యాంగ్... ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులలో చర్చకు వస్తానంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రెడీ అయ్యారు... రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో వస్తారనే సమాచారం ఉండటంతో, ఇరుపార్టీల నేతలు ఎదురుపడితే ఘర్షణలు తలెత్తే అవకాశాలుండటంతో పులివెందులలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
అయితే అనూహ్యంగా, వైసిపీ వ్యూహం మార్చింది... నియోజకవర్గం నుంచే గాక కడప జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా పులివెందులకు రప్పించారు... వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు... తమ నేత హౌస్ అరెస్టును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు... రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసారు... పులివెందుల పూల అంగళ్లు సర్కిల్లో రాళ్ళ దాడి చేసారు...అదే సందర్భంలో కొంత మంది తెలుగుదేశం వారు కూడా, ఎదురు తిరిగారు..
ఈ సందర్భంలో పోలీసులు వైసిపీ కార్యకర్తలని అడ్డుకోవటంతో, వారి పై రాళ్ల దాడి చేసారు. ఈ రాళ్లదాడిలో ఎస్ఐకి గాయాలయ్యాయ... దీంతో ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు... కొంత మంది పోలీసులకి కూడా గాయాలు అయ్యాయి... దీంతో మరింత ఫోర్సు తీసుకోవచ్చి, అక్కడ నుంచి చెదరగొట్టారు... రాళ్ల దాడి చేసిన వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు... మరో పక్క, ఇప్పటికీ పులివెందులలో టెన్షన్ వాతావరణం ఉంది..మరింత మంది పోలీసులను రప్పిస్తున్నారు...