చంద్రబాబుని ఇబ్బంది పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ చేస్తున్నారు అనే వార్తలు వస్తే, కొంత మంది, ఇవన్నీ పిట్ట కధలు అంటూ తీసి పారేసారు.. కాని, జరుగుతున్న పనులు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనే అభిప్రాయం కలుగుతుంది... చంద్రబాబు అంతటి లీడర్ లేదు అంటూ మొన్నటి దాక పొడిగిన పవన్, రాత్రికి రాత్రి ప్లేట్ తిప్పటం, విభజన హామీలు ఇవ్వాల్సిన బీజేపీని ఒక్క మాట అనకుండా, జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని మాత్రమే తిట్టటం, ఐవైఆర్, ముద్రగడ, మోత్కుపల్లి, పోసాని లాంటి వారిని అడ్డం పెట్టుకుని, కులాల వారీగా ప్రజలను రెచ్చగొట్టటం వంటివి, చూస్తూ ఉంటే చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని, తమిళనాడు లాగా నాశనం చెయ్యటానికి, ఢిల్లీ పెద్దలు వేసిన స్కెచ్ లో, వీరందరూ ఎలా పని చేస్తున్నారో తెలుస్తుంది..

bjpycp14062018 2

అయితే, ఇప్పుడు మాత్రం, వైసీపీ, బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు... ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో ఇలాంటి వేషాలు వేస్తే దొరికిపోతామని, ఢిల్లీలో మీటింగ్ సెట్ చేసారు. అయితే, మీడియా అప్రమత్తతతో దొరికిపోయారు... సిసి టీవీ ఫూటేజ్ తో అడ్డంగా దొరికి పోయారు.. ఈ సమావేశం కోసం, ఒకే కారులో బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వచ్చారు. వైసీపీ, బీజేపీ నేతల ఢిల్లీ సమావేశం రాజకీయవర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు, మారుతున్న పరిస్థితులు, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ టీడీపీ చేస్తున్న పోరాటం.. తదితర విషయాలపై వీరు చర్చించినట్లు చెబుతున్నారు. సమావేశానికి సంధానకర్తగా రాంమాధవ్‌ వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వివరాలను ఎప్పటికప్పడు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం.

bjpycp14062018 3

ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మరోవైపు పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కోసం లోపలికి వెళుతున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. టీడీపీ ప్రభుత్వం అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే బుగ్గన, బీజేపీ నేతలకు నివేదిక సమర్పించారని తెలుస్తుంది. పీఏసీ చైర్మన్‌గా అన్ని విషయాలను లోతుగా పరిశీలించానని బుగ్గన చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పడు ఆ వివరాలన్నీ నివేదిక రూపంలో బీజేపీ నేతలకు ఇచ్చారని, ఈ సమావేశంలో కీలక విషయం ఇదేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read