మొన్నటి వరకు జగన్ ని పొగిడిన వారే, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. నిజంగానే, ఇది వైసిపీలో సరి కొత్త పరిణామం. ఇప్పటి వరకు పార్టీలో ఎన్ని ఉన్నా, వైసీపీ కార్యకర్తలు, ఎప్పుడు జగన్ పై విమర్శలు చెయ్యలేదు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన వెనుక ఉన్నారు. అయితే ఇప్పుడు మొదటిసారి, జగన్ తీసుకున్న నిర్ణయం పై, వైసిపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో, జగన్ కు నైతిక విలువలు లేవు అంటూ, వైసీపీ క్యాడర్, సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తుంది. ఎన్నికల్లో గెలుపు కోసం, గత 10 ఏళ్ళుగా జగన్ కోసం కష్టపడిన వారిని పక్కన పడేసి, పక్క పార్టీల నుంచి వస్తున్న వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని , ఇలాగే కొనసాగితే, పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. అసలు వైసిపీ క్యాడర్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే, రెండు కారణాలు ఉన్నాయి.

jupudi 11102019 2

నెల రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో నుంచి చేర్చుకున్న తోట త్రిమూర్తులు, దళిత ద్రోహి అంటూ, పోరాటాలు చేసామని, ఇప్పుడు అతన్ని తీసుకు వచ్చి, పార్టీలో రెడ్ కార్పెట్ వేసారని అంటున్నారు. అయితే, ఈ బాధ మర్చిపోక ముందే, ఇప్పుడు జూపూడి ప్రభాకర్ ను పార్టీలోకి తీసుకోవటంతో, వైసీపీ కార్యకర్తలు గోల గోల చేస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీలోకి బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా రాని వ్యతిరేకత, జూపూడి చేరికను మాత్రం వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. నేను తప్పిపోయిన గొర్రె లాగా, పార్టీ మారాను అని, ఇప్పుడు జగన్ నాకు మెస్సయ్యలా కనిపిస్తున్నారని, జూపూడి చేసిన వ్యాఖ్యలతో, వైసిపీ కార్యకర్తలకు చిర్రేత్తుకొచ్చింది. టీవీ డిబేట్లలో జూపూడి జగన్‌పై, వైఎస్‌పై చేసిన విమర్శలు, ఇంకా చెవిలో తిరుగుతూనే ఉన్నాయని అంటున్నారు.

jupudi 11102019 3

అలాంటి వ్యక్తిని తిరిగి పార్టీలో చేర్చుకుని తమ మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియా సాక్షిగా జగన్ నిర్ణయాన్ని తప్పు బడుతుంది. పార్టీ ఇంత బలంగా ఉంటె, ఇలాంటి వారిని చేరుచుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని, ప్రశ్నిస్తున్నారు. జగన్ తల్లిని బూతులు తిట్టిన, జేసి సోదరులను కూడా చేర్చుకోండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే, పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతాం అని అంటున్నారు. ఇక మరో పక్క, టీడీపీ శ్రేణులు కూడా జూపూడి పై విరుచుకు పడుతున్నారు.జగన్ సైకో మనస్తత్వం తెలిసే వైఎస్ కూడా దూరం పెట్టారని వ్యాఖ్యానించిన జూపూడి, ఇప్పుడు జగన్ ను మెస్సయ్య అంటున్నారు అంటే, ఇతను ఎలాంటి వాడో తెలుస్తుందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read