తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అంటే, ఎందుకో కాని వైసీపీకి ముందు నుంచి టార్గెట్. లోకేష్ క్యారక్టర్ అసాసినేషన్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. అయితే అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టటంలో ఫెయిల్ అవ్వటంతో, లోకేష్ అంటే పప్పు అనే అభిప్రాయం పెంచటంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. దీంతో లోకేష్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా, 25 వేల కిమీ సీసీ రోడ్లు వేసినా, డ్రైనేజి వ్యవస్థ మెరుగుపరిచినా, తాగు నీరు అవసరం తీర్చే ప్రయత్నం చేసినా, ఐటి మంత్రిగా హెచ్సీఎల్, ఆదనీ డేటా సెంటర్ లాంటి పరిశ్రమలు తెచ్చినా, ప్రజలకు మాత్రం, వైసీపీ చేసిన ప్రచారమే ఎక్కింది. అయితే అధికారం పోయిన తరువాత, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా కూడా, వైసీపీ, లోకేష్ నే టార్గెట్ చేస్తుంది. మంత్రులు కొడాలి నాని లాంటి వాళ్ళు కాని, పార్టీ మారే వంశీ లాంటి వాళ్ళు కాని, లోకేష్ నే ఇంకా ఇంకా టార్గెట్ చేస్తున్నారు.

lokesh 29112019 2

ఒక పక్క లోకేష్ ని ఫెయిల్యూర్ గా చూపిస్తూనే, లోకేష్ అంటే ఎందుకో భయపడుతున్నారు. అందుకే లోకేష్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొన్నటి మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటి నుంచి లోకేష్ ని సస్పెండ్ చేసారు. అలాగే, స్పీకర్ తమ్మినేని తన పై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు స్పందించినందుకు, లోకేష్ పై అసెంబ్లీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చారు. తాజాగా లోకేష్, మా మంత్రులను టార్గెట్ చేసాడు, మా మంత్రులు, ముఖ్యమంత్రి పై కుట్ర పన్నాడు అంటూ, లోకేష్ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. నిన్న చంద్రబాబు, అమరావతి పర్యటనలో భాగంగా, అక్కడ జరుగిన నిర్మాణాలు, ఆగిపోయిన నిర్మాణ పరిస్థితి అంతా చూడటానికి, డ్రోన్ ద్వారా చిత్రీకరణ జరిగింది. ఆ విజువల్స్ బయటకు కూడా వచ్చాయి.

lokesh 29112019 3

అయితే, డ్రోన్ లో ఎగరేసింది, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీద అని, అక్కడ మా మంత్రులు, సియం కార్యాలయం ఉందని, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని, ఈ కుట్ర మొత్తం నారా లోకేష్ ఆధ్వరంలో జరిగింది అని, దీని వెనుక అసలు ఏమి కుట్ర లోకేష్ పన్నాడు, అసలు విషయం ఏమిటి, మొత్తం తెలుసుకుని, తక్షణం చర్యలు తీసుకోవాలని, వైసీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు, లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా డీఎస్పీకి ఫిర్యాదు చేసారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి, కుట్ర అంతా బయట పెట్టాలి అంటూ, లేఖలో పేర్కొన్నారు. అయితే, దీని విషయం పై ఇప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. మరి పోలీసులు, నిజంగానే, ఈ లేఖను సీరియస్ గా తీసుకుని, కేసు పెడతారా, లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read