జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటన సక్సెస్ కాలేదని, అట్టర్ ఫ్లోప్ అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న 12 గంటలకు ఢిల్లీ చేరినా, నిన్నంతా జగన్ కు ఎవరి అపాయింట్మెంట్ దొరకలేదు. అమిత్ షా పిలుస్తారని వేచి చూసినా, పిలుపు రాలేదు. అయితే ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు కావటంతో, అయన కార్యాలయానికి, అందరూ వచ్చి విష్ చేసారు. ఇదే సమయంలో, 11 గంటల ప్రాంతంలో, జగన్ మోహన్ రెడ్డి కూడా అక్కడకు చేరుకొని, అమిత్ షా ని కలిసారు. అయితే, కేవలం మర్యాద పూర్వకంగా కలిసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, మెమోరాండం ఇచ్చి వచ్చేశారని, మీడియాలో వార్తలు వచ్చాయి. తరువాత అపాయింట్మెంట్ ఉన్న కేంద్ర మంత్రులు కూడా, జగన్ తో అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని, దీంతో, జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని, విశాఖ వచ్చేసారని, వార్తలు వచ్చాయి.

ycp 22102019 2

అయితే, ఈ ప్రచారం పై వైసిపీ స్పందించింది. ఇదంతా తెలుగుదేశం కుట్ర అని, టిడిపి అనుకూల మీడియాలో, అనవసరంగా ఏదో జరిగిపోయిందనే హడావిడి చేస్తున్నారని, నిజానికి అమిత్ షా తో సమావేశం బ్రహ్మాండంగా జరిగిందని, వైసిపీ చెప్తుంది. ముఖ్యంగా పోలవరం రివర్స్ టెండరింగ్ లో, డబ్బులు ఆదా చెయ్యటంతో, అమిత్ షా చాలా సంతోషంగా ఉన్నారని, అమిత్ షా, జగన్ ను అభినందించారని వైసిపీ అంటుంది. అయితే, మరో పక్క రివర్స్ టెండరింగ్ ను, కేంద్ర జల శక్తి మంత్రితో పటు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పు పట్టిన విషయం తెలిసిందే, మరో పక్క హైకోర్ట్ కూడా దీని పై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి కోర్ట్ లో ఉన్న అంశం పై, ఏకంగా దేశ హెం మంత్రి శభాష్ అని అన్నారు అంటే, ఇది వైసిపీ విజ్ఞతకే వదిలెయ్యాలి.

ycp 22102019 3

మరో పక్క, ఈ రోజు జగన్ మరో ఇద్దరు మంత్రులను కలవాల్సి ఉంది. న్యాయ శాఖా మంత్రి, బొగ్గు శాఖా మంత్రితో, జగన్ కు అపాయింట్మెంట్ ఉంది. అయితే, ఎందుకో కాని, ఉన్నట్టు ఉండి, వారు అపాయింట్మెంట్ రద్దు చేసారనే వార్తలు వచ్చాయి. అయితే, దీని పై కూడా వైసిపీ వివరణ ఇస్తూ, వాళ్ళు రద్దు చెయ్యలేదని, జగనే వెళ్లలేదని అంటున్నారు. దీనికి కారణం చెప్తూ, అమిత్ షా భేటీలో, నేను వారితో మాట్లాడతానని చెప్పారని, ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారని, ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన జగన్‌కు సూచించారని, అందుకే మంత్రులతో భేటీ వాయిదా పడిందని, వైసిపీ చెప్తుంది. అమిత్ షా పుట్టిన రోజు నాడు, బిజీగా ఉండి కూడా, 45 నిమిషాలు మాట్లాడారు అంటే, అమిత్ షా, జగన్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుస్తుందని, వైసిపీ అంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read