అనుకున్నదే జరిగింది... పొద్దున నుంచి పులివెందులలో, ముఖ్యమంత్రి పర్యటనలో అలజడి సృష్టించాలి అని సర్వ ప్రయత్నాలు చేసి విఫలం అయిన వైసిపి ఏకంగా తన ఎంపీ చేతే సభలో అలజడి సృష్టించారు... ఏ ఎమ్మల్యే, ఎంపీ, కార్యకర్త జన్మభూమి మీటింగ్లకు వెళ్ళద్దు అని ఆదేశాలు ఇచ్చిన వైసిపి, కడపలో పులివెండ్లలో జరుగుతున్న ముఖ్యమంత్రి మీటింగ్ కు మాత్రం, అక్కడ స్థానిక ఎంపీ, జగన్ కుటుంబ సభ్యుడు, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పంపించారు... అవినాష్‌రెడ్డి పెద్ద ఎత్తున తన కార్యకర్తలను తీసుకురావటంతోనే అక్కడ ఎదో జరుగుతుంది అని పోలీసులు గ్రహించి అలెర్ట్ అయ్యారు...
అవినాష్‌రెడ్డి తీసుకొచ్చిన కార్యకర్తలు ఎదో ఒక గొడవ చేస్తారు అని గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తన వారి మీద నిఘా పెట్టారు.. ఇక చేసేది లేక అవినాష్‌రెడ్డి రంగంలోకి దిగారు... ప్రోటోకాల్ ప్రకారం మైక్ తీసుకుని, ఇక్కడ జరిగింది అంతా రాజశేఖర్ రెడ్డే చేసారు అని, మీరు చేసింది ఏమి లేదు అంటూ మొదలు పెట్టారు.. దీంతో ముఖ్యమంత్రి కల్పించుకుని మాట్లాడుతున్నా అవినాష్‌రెడ్డి మాత్రం ఆపటం లేదు... దీంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదు అని, నేను ఇక్కడకు రాజకీయం చెయ్యటానికి రాలేదు, ఇలా చెప్పుకుంటూ పొతే, నేను చాలా చెప్తాను, ఇది రాజకీయ సభ కాదు, ప్రభుత్వ సభ అంటూ చెప్పారు...
మీకు ఎమన్నా కావలి అంటే చెప్పండి, ఎమన్నా పనులు కావలి అంటే అడగండి ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్తున్నా అవినాష్‌రెడ్డి మాత్రం వినలేదు.... దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు... తరువాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని, అంతా మేమే చేసాము అని చెప్తే కుదరదు అని, ఎవరు చేసారో ప్రజలకు తెలుసు అంటూ, వారికి చురకలు అంటించారు... తరువాత అక్కడ ప్రజా ప్రతినిధులు అడిగిన వినతులకు స్పందించి, పులివెందులకు వరాలు ప్రకటించారు...