వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే అసలు జగన్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అనే పేరు వాడటం పైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. రెండు నెలల క్రిందట జగన్ పార్టీకి చెందిన సొంత ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్నా స్కాంలను, జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, ఆయనకు అపాయింట్మెంట్ లభించకపోవటంతో, మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ సమస్యలు ఏకరవు పెట్టారు. ఈ క్రమంలోనే, రఘురామకృష్ణం రాజుకి, జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో, విజయసాయి రెడ్డి, ఆయనకు క్రమశిక్షణ నోటీసు ఇచ్చారు. సరిగ్గా ఇక్కడ మొదలైంది పంచాయతీ. తనకు ఇచ్చిన నోటీస్ కి సమాధానం చెప్పకుండా, ఆయన ఒక లాజికల్ పాయింట్ బయటకు తీసారు. తనకు ఇచ్చిన నోటీస్ లెటర్ హెడ్ పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని, అసలు తనకు ఈ పార్టీకి సంబంధం లేదని, తనకు పార్టీ ఇచ్చిన బీఫాం పై యువజన శ్రామిక రైతు పార్టీ అని ఉందని, దాని పై నోటీస్ ఇవ్వకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వేరే పార్టీకి సమాధానం ఎలా ఇస్తాను అని చెప్పుకొచ్చారు.
అయితే అప్పటికే ఉన్న అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ మొత్తం వ్యవహారం పై అభ్యంతరం చెప్పింది. తమ పార్టీ జగన్ పార్టీ కంటే ముందే పెట్టాం అని, తమ పార్టీ పేరు ఎవరూ వాడుకో కూడదు అంటూ ఇది వరుకే ఎలక్షన్ కమిషన్, జగన్ పార్టీకి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు మహబూబ్ భాషా కోర్టు ముందుకు వచ్చారు. అయితే ఇంతకంటే ముందే ఆయన ఎలక్షన్ కమిషన్ వద్ద ఈ విషయం ప్రస్తావించినా, సరైన సమాధానం రాకపోవటంతో, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు, జగన్ పార్టీకి, ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు రేపు, గురువారం విచారణకు రానుంది. అయితే ఇప్పటి వరకు జగన్ పార్టీ, కోర్టులో కౌంటర్ దాఖలు చెయ్యలేదు. దీంతో ఈ కేసు పై కోర్టు ఏమి చెప్తుందా అనే టెన్షన్ నెలకొంది. జగన్ పార్టీ వ్యుహాత్మికంగా కౌంటర్ దాఖలు చెయ్యకుండా, ఈ కేసులో కౌంటర్ దాఖలకు మరి కొంత సమయం అడిగే అవకాసం ఉందని, అందరూ భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాత్రం తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, రేపు ఈ విషయం పై కోర్టు విచారణ తరువాత మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.