జగన్ అధికారంలోకి వచ్చిన మొదలు, ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణుల పై 140 దాడులు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది, అయినా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట, ఒక తెలుగుదేశం కార్యకర్తను చంపెస్తూనే ఉన్నారు. అధికార మదంతో వైసీపీ చేస్తున్న ఆగడాలు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయి. ఏకంగా మహిళలను వివస్త్రను చేసి హింసించే సంఘటనలు మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబ పురంకు చెందిన పద్మ అనే మహిళ, వైసీపీ దాడులకు బలి అయిపొయింది. ఆమె భర్తను కూడా తీవ్రంగా కొట్టటంతో, ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పద్మ దంపతులను గత కొన్ని రోజులుగా వైసీపీలో చేరాలంటూ తీవ్ర ఒత్తిడులు వస్తున్నాయి. వారు మాత్రం తెలుగుదేశం పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో వారి పై కక్ష పెంచుకుని, అదును కోసం ఎదురు చూస్తూ, ఈ రోజు స్పాట్ పెట్టారు. చిన్నగా మొదలైన గొడవ, చంపేసే దాకా వెళ్ళింది.

ఈ రోజు ఉదాయం పద్మ పై దాడి చేసి, తమ కక్ష తీరకపోవటంతో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ చేసిన ఈ దుశ్శాసన పర్వం తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురై, అవమానం భారంతో బలవంతంగా చనిపోయింది. అప్పటికే తన భర్తను తీవ్రంగా కొట్టటంతో ఆయన కూడా అపస్మారక స్థితిలో హాస్పిటల్ లో ఉన్నారు. ఊరి అందరి ముందు, ఓ మహిళను, బట్టలు విప్పేందుకు ప్రయత్నించడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ చనిపోవటానికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఇష్టం వచ్చినట్టు మా ఇళ్ల పై దాడి చేస్తున్నా,పోలీసులు చూస్తూ కూర్చుంటున్నారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ ఘటన తరువాత పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read