గత కొన్ని రోజులుగా, వైసీపీకి చెందిన ఫేక్ బ్యాచ్ ఎన్నో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తుంది. సామాన్య ప్రజలు మాట్లడిస్తున్నట్టు, వారే మాట్లాడించి, చంద్రబాబు పై, లోకేష్ పై బురద జల్లుతున్నారు. తద్వారా, న్యూట్రల్ ఓటర్స్ ను ప్రభావితం చేసేలా ప్లాన్ చేసారు. గత రెండు రోజులుగా ఒక పెద్దావిడ, నన్ను అధికారులు, లోకేష్ అన్యాయం చేసారంటూ ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో కులం ప్రస్తావన కూడా ఉంది. మొత్తానికి, అది చూసిన ఎవరైనా, పాపం నిజమే అనుకుంటారు. లోకేష్ ఎదో చేసాడు అనే అనుకుంటారు. కాని వాస్తవం వేరు. ఇదే విషయం పోలీసులు విచారణలో తేల్చారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కావాలని పెడితే ఊరుకునేది లేదని చెప్పారు. ఇలాంటివి షేర్ కూడా చెయ్యవద్దు అని చెప్పారు. వీడియోలో మాట్లాడిన ఆ మహిళ పై కూడా సైబర్‌ క్రైం కింద కేసు నమోదైంది. ఇది ఈ వీడియో వెనుక అసలు విషయం.

ఈ కేసు సంబంధించి వివరాలను గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ స్నేహిత తెలిపారు. వేమూరు నియోజకవర్గం పోతుమర్రుకు చెందిన వెంకటేశ్వర్లు, జి.పద్మావతి భార్యభర్తలు. భర్త హైకోర్టు న్యాయవాదిగా పనిచేసేవారు. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో 2005 నుంచి విడిగా ఉంటున్నారు. వెంకటేశ్వర్లు తన స్వగ్రామం పోతుమర్రులో, పద్మావతి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో పిల్లలతో కలిసి ఉండేవారు. ఈ క్రమంలో 2011వ సంవత్సరంలో వెంకటేశ్వర్లు తన స్వార్జితమైన 7.5 ఎకరాలను శివారెడ్డికి విక్రయించగా, ఆయన దానిని బంధువు చంద్రశేఖర్‌రెడ్డికి అమ్మారు. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటున్నారు. 2016లో అనారోగ్యంతో వెంకటేశ్వర్లు మృతి చెందారు. అనంతరం పిల్లలతో కలిసి పోతుమర్రు వచ్చిన పద్మావతి భర్త ఇంట్లోనే ఉంటున్నారు. భర్త నుంచి ఆమెకు 7.5 ఎకరాల భూమి వచ్చింది. తనకు రావాల్సిన ఆస్తి మొత్తం 15 ఎకరాలని, భర్త అమ్మిన ఆస్తి కూడా తనకు చెందేలా తహశీల్దార్‌, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌, డీఎస్పీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులను కలిశారు. ఒంటరి మహిళ కావడంతో అందరూ ఆమె ఆవేదనను వింటూ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించారు.

అధికారుల పరిశీలనలో ఆమె భర్త ఆస్తిని విక్రయించినట్లు దస్తావేజులు ఉండటంతో రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని సంప్రదించారు. వారు కూడా పక్కా దస్తావేజులని నివేదిక ఇవ్వడంతో ఆమెకు విషయాన్ని వివరించి సమస్య పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని సంప్రదించాలని సూచించారు. ఆధారాలు లేకపోవడంతో క్రయవిక్రయాలపై న్యాయస్థానం ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 21న పద్మావతి దాదాపు 30 మంది కలిసి పొలంలో ఉన్న శివారెడ్డి, మరో ఇద్దరిని కిడ్నాప్‌ చేసి పోతుమర్రు చర్చిలో బంధించారు. వారిని హింసించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవాలని ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని విడిపించి కిడ్నాప్‌, ఇతర కేసులు నమోదు చేశారు. తాను అనుకున్నట్లు ఆస్తి దక్కక పోవడంతో ఆమె రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు మోసం చేశారంటూ వారి పేర్లతో కూడిన స్వీయ వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో అవాస్తవాలతో కూడినది కావడంతో ఎవరూ షేర్‌ చేయవద్దని డీఎస్పీ సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read