ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఏమైనా విమర్శలు చేస్తే, వాళ్ళను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నాడని, లేదా వారు ఆ ఒక్క కులం అంటూ టార్గెట్ చేసి, ఎదురు దాడి చేయటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని అయిపొయింది. ఆ విమర్శ ఏంటి, ఎందుకు చేసారు, దాంట్లో ఉన్న లోతు ఏమిటి, ఇలా దానిపైన మాత్రం ఎవరూ మాట్లాడరు. కేవలం ఎదురు దాడి చేయటం తప్పించుకోవటం. చివరకు తీర్పులు చెప్పే జడ్జీలను కూడా అలాగే టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాగే మరొకరు టార్గెట్ అయ్యారు. ఈ సారి నేషనల్ మీడియా. చివరకు నేషనల్ మీడియాలో తమకు వ్యతిరేక కధనాలు వస్తే, దానికి కారణం తెలుగుదేశం అని చెప్పేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రిపబ్లిక్ టీవీ ఛానల్ లో, జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు, విదేశాల్లో చేసిన అవినీతి పై, విదేశీయులు కొంత మంది కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు, వారం రోజులు క్రిందట రిపబ్లిక్ టీవీలో సంచలన కధనం ప్రసారం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. అసలు ఆ ఫిర్యాదు చేసింది ఎవరు, ఏ కంపెనీ, ఏ వ్యక్తి, అసలు వీళ్ళు చేసిన స్కాం ఏంటి, ఎలా దొరికారు అనే విషయం పై, ఆరాలు తీయటం మొదలు పెట్టారు. అయితే వారం తిరగకుండానే, ఇప్పుడు మరో కధనం రిపబ్లిక్ టీవీలో ప్రసారం అయ్యింది.

arnab 09032021 2

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన కొంత మంది, ప్రజా ప్రతినిధులు ఆయనతో విభేదిస్తున్నారని, పార్టీలో సంక్షోభం వచ్చే అవకాసం ఉంది అంటూ, సంచలన కధనం ఒకటి ప్రసారం అయ్యింది. దీంతో మళ్ళీ అలజడి రేగింది. ఇక లాభం లేదని, తమ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కోటరీలో నెంబర్ వన్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగారు. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ పై, విమర్శలు గుప్పించారు. దేశానికి పట్టిన పీడ అర్నాబ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు సజ్జల. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, చంద్రబాబు కోసం ఆ కధనం రాసారని, తమకు అనుమానం ఉంది అంటూ సజ్జల వ్యఖ్యలు చేసారు. అర్నాబ్ ఫేక్ న్యూస్ వేశాడని, ఆ ఫేక్ న్యూస్ పై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, రిపబ్లిక్ టీవీ కధనాల్లో ఒక్కటి కూడా నిజం లేదని, చంద్రబాబు చెప్పినట్టు వార్తలు రాస్తున్నారు అంటూ, ఏకంగా నేషనల్ మీడియాను కూడా చంద్రబాబుకు అంటగట్టారు. ఇంకా నయం, కులంతో అంటగట్టలేదని, అందరూ అనుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read