యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్‌పై వైసీపీ ఫోక‌స్ చేసింది. పాద‌యాత్ర ఇప్ప‌టికే వంద‌రోజులు పూర్తిచేసుకుని జనానికి చేరువైన ద‌శ‌లో ఏదో ఒక విధంగా లోకేష్‌ని బ‌ద్నాం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వైసీపీ, పేటీఎం గ్యాంగుల ఎత్తుగ‌డ‌ల‌న్నీ జ‌నాభిమానంతో చిత్త‌య్యాయి. అందుకే లోకేష్ ప్ర‌సంగాల‌ని అబ్జ‌ర్వ్ చేస్తూ, అందులో మాట‌ల‌ని ఎడిట్ చేసి త‌ప్పుగా మాట్లాడిన‌ట్టు మార్ఫింగ్ చేసి వ‌దల‌డం మొద‌లుపెట్టారు. లోకేష్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. ద‌ళితుల‌కు ఏం పీకావ్ జ‌గ‌న్ రెడ్డి అని లోకేష్ వాడిన డైలాగ్‌ని ...``ద‌ళితులు ఏం పీకారు`` అని మార్చేసిన వైసీపీ ముఠాలు తాము ఎంత‌కైనా తెగిస్తామ‌ని సంకేతాలిచ్చాయి. త‌న వాడివేడి ప్ర‌సంగాలు కొన‌సాగిస్తూనే, ఇటువంటి మార్ఫింగ్ మారీచ చేష్ట‌ల‌పైనా గ‌ట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కూ అమ్మ తండ్రి ఎన్టీఆర్ నే తాత‌య్య అని ప్ర‌తీ స‌భ‌లో లోకేష్ ప్ర‌స్తావిస్తార‌ని, నాన్న తండ్రి ఖ‌ర్జూర‌నాయుడు పేరే త‌ల‌వ‌ర‌ని చాలా రోజులు త‌మ పేటీఎం బ్యాచుల‌తో ప్ర‌చారం చేశారు. లేటెస్ట్‌గా నంద్యాల ప‌రిధిలో రైతుల‌తో జ‌రిగిన స‌మావేశంలో త‌న తాత ఖ‌ర్జూర‌నాయుడు చ‌దువుకోక‌పోయినా, నేచుర‌ల్ ఫార్మింగ్ చేసేవార‌ని, ఆ త‌రంలో త‌మ పంట‌కి కావాల్సిన విత్త‌నాలు తామే త‌యారు చేసుకునేవార‌నీ, ఎరువులు-పురుగుమందుల జోలికి వెళ్లేవారు కాద‌ని చెప్పుకొచ్చారు. దీనిని ప‌ట్టుకుని వైసీపీ సోష‌ల్ మీడియా కూలీ ముఠాలు చెల‌రేగిపోతున్నాయి. మొన్న‌టివ‌రకూ ఖ‌ర్జూర‌నాయుడు తాత పేరు ఎందుకు త‌ల‌వ‌వు లోకేష్ అని పోస్టులు పెట్టిన గాడిద‌పాటి బ్యాచ్, ఇప్పుడు ఖ‌ర్జూర తాత గుర్తొచ్చారా లోకేష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరి వైఖ‌రి చూస్తే, లోకేష్ ఏం మాట్లాడినా...దానిని విమ‌ర్శిస్తూ పోస్టులు వేయాల‌ని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన‌ట్టు మాత్రం అర్థం అవుతోంది

Advertisements

Advertisements

Latest Articles

Most Read