నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావలి అంటూ పాదయాత్ర చేస్తున్న జగన్, పెద్ద ఘనకార్యం చేసాడు అని, 1000 కిలోమీటర్లు నడిచేసాడు అని, వాక్ విత్ జగన్ అంటూ, ఊరు ఊరునా తిరుగుతాం అంటూ, నిన్న వైసీపీ, జగన్ కు సంఘీభావంగా తిరిగింది... ప్రకాశం జిల్లాలో నాటు తుపాకులతో హడావిడి చేస్తూ, రోడ్డు మీద వైసిపీ పార్టీలో ఉన్న ఇరు వర్గాలు కొట్టుకుని, దాన్ని ఫైట్ విత్ జగన్ కార్యక్రమంగా మార్చాయి... అదే విధంగా, విజయవాడలో మాత్రం, వాక్ విత్ జగన్ కాస్త, ఒక కుటుంబం పాలిట,ద డెత్ విత్ జగన్ అయ్యింది... పోలీసులకి కనీసం సమాచారం ఇవ్వకుండా, కిరాయి మూకను వేసుకుని చేసిన పాదయాత్ర, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది...

jogi 30012018 2

వివరాలు ఇలా ఉన్నాయి... నిన్న వైసిపీ పార్టీ, కృష్ణా జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ ఆధ్వర్యంలో కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో పాదయాత్ర నిర్వహించారు.. అదే సమయంలో ఓ అంబులెన్స్ రాగా అది పాదయాత్రతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్‌లో హార్ట్ పేషెంట్ రాములు మృతిచెందాడు... రాములు అనే ఆయన, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగి... విధులు ముగించుకుని, ఇంటికి వెళ్తుంటే, గుండె నొప్పి వచ్చి రోడ్డు మీదే కుప్పకూలి పోయారు... అక్కడే ఉన్న ఆటో డ్రైవర్, అంబులెన్స్‌ కు ఫోన్ చేసి, దగ్గరలోని నిర్మా మెడికల్ కాలేజీకి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు...

jogi 30012018 3

అదే సందర్భంలో వాక్ విత్ జగన్ అంటూ, జోగి రమేష్, కిరాయి గాళ్ళతో కొత్త గేటు సెంటర్ దగ్గర పెద్ద ర్యాలీ చేస్తున్నాడు... ఇది అనుమతి లేని ర్యాలీ కావటంతో పోలీసులు కూడా పెద్దగా లేరు... ఒకే ఒక రక్షక్ వాహనం ఉండటంతో, అంబులెన్స్‌ డ్రైవర్ రక్షక్ కి చెప్పినా, ఎక్కువ పోలీసులు లేకపోవటంతో, వారిని క్లియర్ చేసి అంబులెన్స్‌ కి దారి ఇవ్వటానికి 32 నిమషాలు పట్టింది... అయితే నిమ్రా హాస్పిటల్ కి తీసుకువెళ్ళే సరికి, రాములు చనిపోయారు అని డాక్టర్ లు చెప్పారు... రాములు కొండపల్లి దగ్గర ఉన్న భీమ రాజు గుట్ట దగ్గర నివాసం ఉంటారు... ఆయన కుటుంబ సభ్యలకు సమాచరం ఇచ్చారు... ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అనుమతి లేకుండా పాదయాత్ర నిర్వహించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడంటూ వైసీపీ నేత జోగి రమేష్‌పై కేసున మోదు చేశారు... అదే సందర్భంలో, అనుమతి లేకుండా అంత ర్యాలీ తీసే అవకాశం ఎందుకు ఇచ్చారు అంటూ స్థానిక పోలీసులకు కూడా సమాధానం చెప్పమని, ఆదేశాలు ఇచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read