టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని అంటారు. గతంలో చేసిన విమర్శలనే, ఇప్పుడు పొగడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో ఇది మరీ సహజంగా జరిగిపోతూ ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు పై అనేక ఆరోపణలు చేసే వారు. చంద్రబాబు పెట్టుబడులు కోసం, విదేశీ పర్యటనలు చేసినా, సిఐఐ సమ్మిట్లు పెట్టినా, ఇంకా ఏ విధమైన కార్యక్రమం చేసినా, అన్నిటినీ వ్యతిరేకిస్తూ, అన్నిటిలో అవినీతి జరిగిపోయిందని, చంద్రబాబు మభ్య పెడుతున్నారని, ఇలా అనేక విధాలుగా ప్రచారం చేసే వారు. చంద్రబాబు సుందర మొఖం చూసి పెట్టుబడులు వస్తాయా అని విమర్శలు చేసారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వైసీపీ, చంద్రబాబు సుందర మొఖం చూసే, పెట్టుబడులు వచ్చాయని మెచ్చుకుంది. ఏ సిఐఐ సమ్మిట్ల ద్వారా కృష్ణ కిషోర్ లాంటి ఆఫీసర్ పై అభియోగాలు మోపారో, అవే సిఐఐ సమ్మిట్ ల ద్వారా, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో చెప్పింది. గతంలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా తేలేదు అనే ప్రచారం అబద్ధమని తేలిపోయింది.

ciisummit 17122019 1

గత ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ల ద్వారా ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అని, నిన్న శాసనమండలిలో, సభ్యులు అడిగిన ప్రశ్నకు, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో 1,182 భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూలు కుదరగా, అందులో 309 సంస్థలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్ర్రంభించిన కంపెనీలు ద్వారా, రూ.1.39 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. 1.54 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, అలాగే మూడు సిఐఐ సదస్సుల నిర్వహణకు రూ.108 కోట్లు ఖర్చయిందని వివరించారు. అంటే 108 కోట్లు ఖర్చు పెడితే, 1.39 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.54 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

ciisummit 17122019 1

2016, 2017, 2018లో నిర్వహించిన సదస్సుల్లో కుదిరిన ఎంవోయూల ద్వారా రూ.12.32 లక్షల కోట్ల పెట్టుబడులు, 22.81 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. ఇదీ విషయం పై, మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్ పి సమావేశంలో కూడా చర్చించారు. "సమ్మిట్స్ ద్వారా రూ.1,39,000కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,54,000మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసన మండలిలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిని బట్టే టిడిపి హయాంలో సమ్మిట్స్ విజయవంతం అయ్యాయని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. దేశంలో 6సమ్మిట్స్ నిర్వహించి, సత్ఫలితాలను రాబట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. " అంటూ చంద్రబాబు, ఇతర నేతలు చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read