విభజన హామీల అమలుపై రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిపూసిన మారేడుకాయ అని విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరో మోసమని.. భాజపా మోసాన్ని అందరూ ఖండించాలని నేతలకు సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి.. ప్యాసింజర్ రాబడి మనకిచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి 7వేల కోట్ల రూపాయల రాబడి పోగొట్టారని.. రిక్రూట్‌మెంట్లలో కూడా మనకన్నా ఒడిశాకే ఎక్కువని వ్యాఖ్యానించారు.

zone 28022019 2

ఎవరిని మోసం చేయాలని ఈ ప్రకటన చేశారని నిలదీశారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా మన జోన్‌కు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఇవాళ సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాలని నేతలకు స్పష్టం చేశారు. రేపు నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని పేర్కొన్నారు. హామీలన్నీ నెరవేర్చాకే మన గడ్డపై అడుగుపెట్టాలన్నారు. రైల్వే జోన్ ఇచ్చారని వైకాపా ఆనందపడుతోందని... చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జోన్ ప్రకటనపై వైకాపా, భాజపా సంబరాలు హాస్యాస్పదమని మండిపడ్డారు.

zone 28022019 3

ఇన్నేళ్లు రాజధానిని తరలించాలని వైకాపా మనసులో కుట్ర పెట్టుకుందని.. ఇప్పుడు అభివృద్ధి చూసి ఏమీ చేయలేక రాజధాని తరలించబోమని చెప్తోందని విమర్శించారు. నిన్న అమరావతిలో జగన్ గృహ ప్రవేశం చేశారని.. మరుసటి రోజే హైదరాబాద్ పయనమయ్యారని.. నిలకడగా రాష్ట్రంలో నివాసం ఉండరని మండిపడ్డారు. జగన్‌కు నిలకడ, విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, రెండు పార్టీల లాలూచీకి ఇది రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీవి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలని, ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని, బీజేపీ, వైసీపీ నాటకాలను ప్రజలే ఎండగట్టాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read