‘‘ఇది మన ఒక్కరి సమస్య కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన సమస్య. అందుకే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరినీ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించాం. వారి సలహాలు, సూచనలతో మోడీ పై, కేంద్రం పై పోరాటాన్ని మరింత బలోపేతం చేద్దాం!’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో, అన్ని పార్టీలని, ఈ రోజు సచివాలయానికి రమ్మని, అఖిలపక్ష నేతలను ఆహ్వానించారు... కేంద్రం ఏమి ఇచ్చింది, మనం ఎంత ఖర్చు పెట్టింది, ఇలా అన్ని వివరాలు అఖిలపక్షం, సంఘాల ముందు అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. నిధుల ఖర్చుకు సంబంధించి UCలు ఇవ్వలేదని కేంద్రం వాదిస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఈ సమావేశంలో ఉంచనుంది.

jsp 27032018

అయితే, ఇది మోడీకి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున పెడుతన్న సమావేశం కావటంతో, మోడీకి లొంగిపోయిన, జనసేన, వైసీపీ, ఈ సమావేశానికి రావట్లేదు అని కబురు పంపింది... మోడీకి వ్యతిరేకంగా పెడుతున్న సమావేశంలో, మేము పాల్గుంటే, అమిత్ షా మాకు 70 యం యం సినిమా చూపిస్తారు, అందుకే మనం వెళ్ళద్దు అని పార్టీల్లో నిర్ణయించుకుని, బయటకు మాత్రం, యధావిధిగా చంద్రబాబు మీద నెట్టేసి, అఖిలపక్షం ఎగ్గొట్టారు... పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణా పోరాటం ఆదర్శంగా తీసుకోవాలి, అందరు కలిసి కేంద్రం పై పోరాడాలి అని చెప్తూ, అందరం కలిసి పోరాడుదాం రండి అని ప్రభుత్వం పిలిస్తే, మేము మోడీకి వ్యతిరేకంగా సమావేశం అయితే వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు...

jsp 27032018

ఇక జగన్ సంగతి అయితే సరే సరి... పార్లమెంట్ లో బీజీపీని ఇబ్బంది పెట్టకూడదు, లోపల ఉంటే వారి పై పోరాడాలి, అందుకే వారికి ఇబ్బంది లేకుండా రాజీనామాలు చేస్తున్నాం అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు... ఇక ఇలాంటి సమావేశాలు వీళ్ళు ఎందుకు వస్తారు... అయితే, ఈ సమావేశాలకు మోడీ పై పోరాడటానికి, వామపక్షాలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు, మరి కొన్ని సంఘాలు, ఈ సమావేశానికి వస్తున్నట్టు చెప్పారు... ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read