బంద్ పేరుతో, వైసిపీ నేతలు అనేక చోట్ల రెచ్చిపోయారు.. తెనాలిలో, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి మరీ, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న మహిళా ఉద్యోగిని, వైసిపీ నేత శివ కుమార్ కుర్చీతో దాడి చేసి కొట్టారు... ఇలా బంద్ చేస్తూ, దుకాణాలు ఏమన్నా తెరిచి ఉంటే చాలు, వారి పై రేచ్చిపోతూ దాడి చేస్తున్నారు... ఈ రోజు ఉదయం తెనాలిలో బంద్ పేరుతో వైసిపీ నేతలు, దుకాణాలు అన్నీ ముపిస్తూ వచ్చారు... అయితే, అదే సందర్భంలో మున్సిపల్ ఆఫీస్ తెరిచి ఉండటం గమనించి, అక్కడకు వెళ్లి, అక్కడ ఉద్యోగులని భయబ్రాంతులకు గురి చేసారు... మేము బంద్ పిలుపు ఇస్తే, మీరు ఉద్యోగాలు చేసుకుంటారా అంటూ, అక్కడ ఉన్న మహిళా ఉద్యోగి పై, కుర్చీతో దాడి చేసారు వైసిపీ నేత శివ కుమార్.. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు... అక్కడకు వచ్చిన పోలీసులు, పరిస్థితి అదుపులోకి తెచ్చారు... కేసు కూడా బుక్ చేస్తామని చెప్పారు...

ycp goons 16042018 1

అయితే ఉదయం తిరుపతిలో కూడా వైసిపీ ఇలాగే రెచ్చిపోయింది... ఈ రోజు ఉదయం రాష్ట్ర బంద్ సందర్భంగా తిరుపతి బస్టాండ్ సమీపంలో ఓ వాహన దారుడు రోడ్ ప్రక్కన పార్క్ చేసిన టూవీలర్ బైక్ దహనం చేశారు. వాహనదారుడు లబోదిబోమంటున్నారు. త‌న‌కు న్యాయం చేయాలని కోరారు. వైస్సార్ సీపీ నాయకులు పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్న బాధితుడు. సామాన్య ప్రజల ఆస్థులు ధ్వంసం చేస్తూ, కేంద్రం పై యుద్ధం ఏంటో వీరికే తెలియాలి... ఇలా బంద్ చెయ్యటం వళ్ళ, రాష్ట్రానికి నష్టం తప్ప, మోడీకి ఏమన్నా అవుతుందా ? ఇలా బంద్ లతో,ర రాష్ట్రం నాశనం అవ్వాలనే వారి ప్లాన్ సక్సెస్ అయినట్టే కాని, వారికి ఏమి అవ్వదు... సామాన్య ప్రజలు ప్రయాణాలు వాయిదా పడితే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? బ్యాంకు లు మూసుకుపొతే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? స్కూల్స్ మూసుకుపొతే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? వ్యాపారాలు మూసేస్తే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? ఎవరి కోసం చేస్తున్నారు ఇది ?

ycp goons 16042018 1

మరో పక్క చంద్రబాబు బంద్ పై, కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సీఎం మాట్లాడుతూ ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఉద్యమసంస్థలు ఆలోచించాలన్నారు. తమని తాము శిక్షించుకోరాదని.. అన్యాయం చేసిన వారిని శిక్షించాలని సూచించారు. తాము చేపట్టే నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అరగంట సేపు నిరసనలో పాల్గొని...మరో గంటసేపు అదనంగా పని చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో టీడీపీ మినహా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read